50 మందికి అక్రమంగా తండ్రయిన డాక్టర్‌.. 40 ఏళ్ల తర్వాత విషయం బయటకు వచ్చి అరెస్ట్‌

సంతానం లేని ఆడవారికి కొంత కాలంగా కొనసాగుతున్న పద్దతి వీర్యదానం, కృత్రిమ గర్బధారణ.

పురుషుల్లో వీర్యం తక్కువ శాతంలో ఉండి మహిళలు తల్లికాలేని సమయంలో వీర్య దాతలను వెదుక్కుంటారు.

వీర్య దాతల పేర్లు బయటకు తెలియకుండా, ఆ వీర్యం ఎవరిదో తెలియకుండా డాక్టర్లు మహిళలకు ఇస్తూ ఉంటారు.తమ వీర్యం ఎవరికి ఇచ్చిన విషయం కూడా పురుషులకు డాక్టర్లు తెలియనివ్వరు.

పెద్ద ఎత్తున ఈ వ్యవహారాలు జరుగుతున్నాయి.అయితే అంతా రహస్యంగానే జరిగి పోతూ ఉంటాయి.

విదేశాల్లో ఇది చాలా ఎక్కువగా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.వీర్యదానం అనేది అమెరికా వంటి అభివృద్ది చెందిన దేశాల్లో 40, 50 ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది.

Advertisement

అమెరికాలోని ఇండియానా అనే ప్రాంతంలో ఒక డాక్టర్‌ ఉన్నాడు.ఆయన తన వద్దకు వచ్చిన సంతానం లేని మహిళలకు వీర్యంను ఇంజెక్ట్‌ చేయడం ద్వారా వారికి పిల్లలు కలిగేలా చేశాడు.

వందలాది మంది మహిళలకు ఆయన వీర్యం ద్వారా పిల్లలు కలిగేలా చేశాడు.అయితే ఆ వీర్యం పూర్తిగా రహస్యపు వ్యక్తుల నుండి తీసుకోవాల్సి ఉంటుంది.కాని ఆయన మాత్రం తన వీర్యంనే ఆ మహిళలందరికి కూడా ఎక్కించాడు.40 ఏళ్లుగా ఆ వ్యక్తి చేస్తున్న మోసం ఇప్పుడు బయట పడింది.

అమెరికాలో ఒక ఆన్‌లైన్‌ పోర్టల్‌ డీఎన్‌ఏలపై ప్రయోగాలు నిర్వహిస్తుంది.ఆ సందర్బంగా 50 మంది డీఎన్‌ఏలు కలవడం అందరికి ఆశ్చర్యంగా అనిపించింది.రక్త సంబంధీకులు మాత్రమే డీఎన్‌ఏలు కలుస్తాయి.

వేరు వేరు ప్రాంతాలకు చెందిన 50 మంది డీఎన్‌ఏలు కలవడంపై అంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.ఆ 50 మంది తమ డీఎన్‌ఏలు కలవడానికి కారణం ఏంటీ అనే విషయాన్ని తెలుసుకునేందుకు సిద్దం అయ్యారు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

ఆ సమయంలోనే వారంతా కూడా వీర్య దానం వల్ల పుట్టిన పిల్లలుగా తెలిసింది.అప్పుడే అర్థం అయ్యింది, వారందరికి కూడా డాక్టర్‌ వీర్య దాత అని, దాంతో 50 మంది కూడా డాక్టర్‌ వద్దకు నాన్న అనుకుంటూ వెళ్లారు.

Advertisement

ఆయన సంతోషం, ఆశ్చర్యం అంతా కలగలిపిన ఫీలింగ్‌లో ఉండగానే పోలీసులు ఆయన మోసానికి అరెస్ట్‌ చేశారు.డాక్టర్‌ వృత్తికే చెడ్డ పేరు తెచ్చారు అంటూ ఆయనపై కేసులు నమోదు అయ్యాయి.

ఇంకా ఎంత మందికి ఈయన వీర్యం ఇచ్చాడు, ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారు అనే విషయాలను పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నాడు.

మొత్తానికి ప్రపంచంలోనే అత్యంత మంది ఈయన వీర్యం వల్ల జన్మించారనే రికార్డు కూడా ఈయన పేరిట నమోదు కాబోతుంది.ఒక వైపు ఈయనకు గర్వంగా ఉన్నా, మరో వైపు కేసులు భయపెడుతున్నాయి.ఆ 50 మంది మాత్రం అతడిని అనధికారికంగా తమ నాన్నగా ఒప్పుకుంటున్నారు.

వారంతా కూడా వివిధ రంగాల్లో వెల్‌ సెటల్‌ అయ్యి ఉన్నారు.

తాజా వార్తలు