విశాలమైన గదులతో మహిళా ఉద్యోగుల వసతి గృహం

వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ జిల్లా మేనేజర్ వి.

సుధా రాణి 100 మంది మహిళలకు వసతి అవకాశం ఏ కోర్సులో నైనా శిక్షణ పొందుతున్న విద్యార్థినులకు 20% సీట్లు రిజర్వేషన్ఆసక్తి గల మహిళలు, విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ నర్సింగ్ స్కూల్ ప్రక్కన 31 విశాలమైన రూమ్ లతో మహిళా ఉద్యోగుల వసతి గృహం ఏర్పాటు చేశామని, ఆసక్తి గల మహిళలు విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవాలని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ జిల్లా మేనేజర్ వి.

సుధా రాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.ప్రభుత్వ/ ప్రైవేటు మహిళా ఉద్యోగులకు, పార్ట్ టైం జాబ్ చేసే మహిళలకు, ఏదైనా కోర్సు నందు శిక్షణ పొందే విద్యార్థులకు భోజనం వసతి సౌకర్యంతో కూడిన 31 విశాలమైన రూమ్ లతో ప్రశాంతమైన వాతావరణంలో తెలంగాణ మహిళ సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగుల వసతి గృహం మహిళల చే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

మహిళా ఉద్యోగుల వసతి గృహం నందు 100 మంది మహిళలకు మాత్రమే అవకాశం ఉంటుందని, ఇక్కడ వైఫై మినరల్ వాటర్ సీసీ కెమెరాలతో కూడిన పరిశుభ్రమైన వాతావరణం, భద్రత, విశాలమైన డైనింగ్ హాల్, ప్రత్యేక గదుల సదుపాయము ఉందని అన్నారు.అవివాహిత మహిళలకు, వితంతువులకు చట్టపరంగా విడాకులు తీసుకున్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని అన్నారు.

ఏదైనా కోర్టులో శిక్షణ పొందుతున్న విద్యార్థినులకు 20% సీట్ల రిజర్వేషన్ కేటాయించడం జరిగిందని, ఈ హాస్టల్ లో అడ్మిషన్ ఫీజ్ 250 రూపాయలు, నెల వారి ఫీజు 3500 ( వసతి, భోజనం కలుపుకుని) ఉంటుందని, ఆసక్తి గలవారు హాస్టల్లో జాయిన్ అయ్యేందుకు సిరిసిల్ల ప్రభుత్వ నర్సింగ్ స్కూల్ ప్రక్కన ప్రతినిధి సంప్రదించాలని , ఇతర వివరముల కొరకు సెల్ ఫోన్ నెంబర్ 7660022509, 7660022510, 7660022511 లను సంప్రదించాలని మేనేజర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement
డ్రంకెన్ డ్రైవ్ కేసు లో 10 మందికి శిక్ష

Latest Rajanna Sircilla News