ప్రభుత్వ రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తూ పేద ప్రజలకు అందకుండా పక్కదారి పట్టిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు

ప్రభుత్వ రేషన్ బియ్యం ప్రజలకు అందకుండా అక్రమరవాణాకు పాల్పడుతున్న పాండు అనే వ్యక్తి అరెస్ట్ రిమాండ్ కి తరలింపు.రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలో 14 కేసులలో నిందుతుడు.

 If Government Ration Rice Is Smuggled And Diverted From Reaching The Poor People-TeluguStop.com

ప్రభుత్వ రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తూ పేద ప్రజలకు అందకుండా పక్కదారి పట్టిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు జిల్లా ఎస్పి అఖిల్ మహాజన్, గత నాలుగు సంవత్సరాలు ఒక ముఠాగా ఏర్పడి జిల్లాలో ప్రభుత్వ రేషన్ బియ్యం ప్రజలకు అంధకుండా పక్కా దారి పట్టిస్తున్నా గుగులోతు పాండు అనే వ్యక్తిని ఇల్లంతకుంట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు నిందితుని వివరాలు 1.గుగులోతు పాండు s/o లక్ష్మణ్, 48yrs, కులము:లంబాడి r/o వట్టిపల్లె, జగదేవపూర్ మండలం సిద్ధిపేట జిల్లా.ప్రస్తుత నివాసం -జిల్లెల్ల, తంగళ్లపల్లి మండలం.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం వట్టిపల్లెకు చెందిన గుగులోతు పాండు బతుకుదేరువు నిమిత్తం సిరిసిల్ల జిల్లా జిల్లెల్లకు 15 సంవత్సరాల క్రితం వచ్చి ఇక్కడ స్థిరపడి గత 4-5 సంవత్సరాల నుండి కొంత మందితో ఒక ముఠాగా ఏర్పడి రేషన్ బియ్యం దందా నిర్యహిస్తూ వ్యాపరిలా ఏదిగాడు.

జిల్లాలోని పలు మండలాలలో తిరిగి రేషన్ బియ్యం కొనుగోలు చేసి వాటిని పెద్ద మొత్తంలో మహారాష్ట్ర లాంటి ప్రాంతాలకు తరలిస్తూన్నాడు.పాండు మీద రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముస్తాబాద్, తంగళ్లపల్లి,సిరిసిల్ల టౌన్,ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్లలో 12 కేసులు, సిద్దిపేట జిల్లాలో 02 కేసు నమోదు కాగా నిన్నటి రోజున నమ్మదగిన సమాచారం మేరకు ఇల్లంతకుంట మండలం కూనబోయినపల్లి గ్రామ శివారులో ఇల్లంతకుంట పోలీస్ వారు అరెస్ట్ చేసి రిమాండ్ పంపినట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న పి.డి.ఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తూ పేద ప్రజలకు అందకుండా పక్కదారి పట్టిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు అని జిల్లా ఎస్పీ తెలిపారు.జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలైన అరికట్టేందుకు నిరంతరం నిఘా పెడుతూ స్పెషల్ డ్రైవ్ లు చేస్తూ విస్తృత స్థాయిలో దాడులు నిర్వహిస్తున్నామని అన్నారు.

పేద ప్రజల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను పక్కదారి పట్టించిన, ప్రజల ఆహార భద్రతకు భంగం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube