ఓటమి భయంతోనే కొత్త డ్రామాకి తెర.. కిషన్ రెడ్డి విమర్శలు

మునుగోడు ఉపఎన్నికలో ఓడిపోతామన్న భయంతోనే టీఆర్ఎస్ కొత్త నాటకానికి తెర తీసిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.

కల్వకుంట్ల కుటుంబం ఒత్తిడిలో ఉందని, అధికారం పోతుందన్న భయం వారిని వెంటాడుతుందని పేర్కొన్నారు.

మునుగోడు ప్రజల దృష్టిని మళ్లించేందుకు టీఆర్ఎస్ పన్నిన కుట్రని ఆయన విమర్శించారు.ఈ క్రమంలో దొరికిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని నిలదీశారు.

టీఆర్ఎస్ ఫిరాయింపులను ప్రోత్సహించి మంత్రి పదవులు ఇచ్చారని తెలిపారు.అనేక మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకున్నది నిజం కాదా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

అదేవిధంగా ఇంద్రకరణ్ రెడ్డి ఏ పార్టీలో గెలిచారు.ఎలా మంత్రి అయ్యారో చెప్పాలన్నారు.

Advertisement

పార్టీలో చేర్చుకునేటప్పుడు నైతిక విలువలు పాటిస్తున్నారా అని ప్రశ్నించారు.కేసులు పెట్టి భయపెట్టి ఫిరాయింపులకు పెద్ద పీట వేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

తండేల్ సినిమాతో నాగ చైతన్య పాన్ ఐడియా హీరోగా ఏడుగుతాడా..?
Advertisement

తాజా వార్తలు