ప్రకాశం జిల్లాలో కూతురి పై అత్యాచారానికి పాల్పడిన తండ్రి

కన్న కూతురి పై అత్యాచారానికి పాల్పడిన ఓ నీచపు తండ్రిని ప్రకాశం జిల్లాలోని మార్కాపురం పోలీసులు అరెస్ట్ చేశారు.మార్కాపురం పట్టణంలోని పూల సుబ్బయ్య కాలనీలో నివాసముండే షేక్ మస్తాన్ వలి, కొండమ్మ అనే మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.

 Father Rape Attempt On Daughter In Prakasham District, Father Rape Attempt, Fath-TeluguStop.com

ఈ నేపధ్యంలో కొండమ్మతో కలిసి తన మైనర్ కూతురుకు మాయమాటలు చెప్పి కడప జిల్లాలోని కలసపాడు గ్రామం కు తీసుకెళ్ళారు.అనంతరం మస్తాన్ వలి, కొండమ్మ కలిసి అక్కడ మద్యం సేవించారు.

తర్వాత అదే మద్యాన్ని బలవంతంగా కూతురికి కూడా తాగించారు‌.అనంతరం ఆ బాలిక పై అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ దుర్మార్గపు తండ్రి.

అంతేకాదు బాలిక మీద అత్యాచారానికి పాల్పడిన సమయంలో సెల్ ఫోన్లో వీడియోలు, ఫోటోలు తీసి, ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ బెదిరించాడు ఆ నీచపు తండ్రి.అయితే కూతురు నీరసంగా ఉండటంతో పాటు భయపడటం చూసిన తల్లికి అనుమానం వచ్చింది.

ఏ జరిగందంటూ ఆరా తీసింది.దీంతో ఆ నీచుడు చేసిన బాగోతం అంతా బయట పడింది.

దీంతో తండ్రి మస్తాన్ వలితో పాటు కొండమ్మ పై గత నెల 25వ తేదిన స్ధానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడు మస్తాన్ వలిని అరెస్ట్ చేసారు.

అతని వద్ద నుండి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు, అతని పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube