ప్రకాశం జిల్లాలో కూతురి పై అత్యాచారానికి పాల్పడిన తండ్రి

కన్న కూతురి పై అత్యాచారానికి పాల్పడిన ఓ నీచపు తండ్రిని ప్రకాశం జిల్లాలోని మార్కాపురం పోలీసులు అరెస్ట్ చేశారు.

మార్కాపురం పట్టణంలోని పూల సుబ్బయ్య కాలనీలో నివాసముండే షేక్ మస్తాన్ వలి, కొండమ్మ అనే మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.

ఈ నేపధ్యంలో కొండమ్మతో కలిసి తన మైనర్ కూతురుకు మాయమాటలు చెప్పి కడప జిల్లాలోని కలసపాడు గ్రామం కు తీసుకెళ్ళారు.

అనంతరం మస్తాన్ వలి, కొండమ్మ కలిసి అక్కడ మద్యం సేవించారు.తర్వాత అదే మద్యాన్ని బలవంతంగా కూతురికి కూడా తాగించారు‌.

అనంతరం ఆ బాలిక పై అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ దుర్మార్గపు తండ్రి.అంతేకాదు బాలిక మీద అత్యాచారానికి పాల్పడిన సమయంలో సెల్ ఫోన్లో వీడియోలు, ఫోటోలు తీసి, ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ బెదిరించాడు ఆ నీచపు తండ్రి.

అయితే కూతురు నీరసంగా ఉండటంతో పాటు భయపడటం చూసిన తల్లికి అనుమానం వచ్చింది.

ఏ జరిగందంటూ ఆరా తీసింది.దీంతో ఆ నీచుడు చేసిన బాగోతం అంతా బయట పడింది.

దీంతో తండ్రి మస్తాన్ వలితో పాటు కొండమ్మ పై గత నెల 25వ తేదిన స్ధానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడు మస్తాన్ వలిని అరెస్ట్ చేసారు.

అతని వద్ద నుండి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు, అతని పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపారు.

కాశ్మీరీ పండిట్ల వలసకు 35 ఏళ్లు .. యూకే పార్లమెంట్‌లో తీర్మానం