పెరూలో ఘోర విమాన ప్రమాదం తృటిలో తప్పింది.లాటం ఎయిర్ లైన్స్ విమానం రన్ వేపై ఉన్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది.
ఎయిర్ బస్ ఎ 320 నియో టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో ట్రక్కులో ఉన్న ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది మృతిచెందారు.
మరో ఉద్యోగికి తీవ్ర గాయాలైనట్లు విమానాశ్రయ అధికారులు ప్రకటించారు.కాగా ప్రమాద సమయంలో విమానంలో 102 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.
లాటం ఎయిర్ లైన్స్ విమానం లిమా నుంచి జూలియాకాకు వెళ్తోంది.