2019లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తన ఉనికిని నిరూపించుకోలేకపోయిన భారతీయ జనతా పార్టీ.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అయినా పోయిన తన గుర్తింపును తిరిగి పొందాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
చాలా రాష్ట్రాలలో పార్టీకి భారీ బలం ఉన్నప్పటికీ ఏపీలో మాత్రం పార్టీ చాలా బలహినంగా ఉంది.రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలుచుకునే అవకాశం లేదని బీజేపీకి తెలుసు కాబట్టి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీతో తన ఉనికిని చాటుకునేందుకు కసరత్తు చేస్తోంది.
అయితే బీజేపీతో పోత్తు వల్ల ఒరిగేదేమి లేదని భావిస్తున్న జనసేన పార్టీ కాషాయ పార్టీని వదిలించుకునే ప్రయత్నం చేస్తుంది.
ఇంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ 2019లో ఒక్క సీటుకే పరిమితమైన పవన్, 2024లో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటే కనీసం కొన్ని సీట్లు అయినా గెలవగలనన్న ధీమాతో ఉన్నారు. బీజేపీ, జనసేన పార్టీలు టీడీపీ లేకుండా పోటీ చేస్తే నష్టం తప్పదు పవన్ భావిస్తున్నారు.
అయితే బీజేపీ నవన్‌ను వదులుకోవడానికి సిద్దంగా లేనట్లు తెలుస్తోంది.దీనికి అనేక వ్యూహాలను రచిస్తోంది.
వైఎస్సార్సీపీ, టీడీపీ రెండింటికీ చెక్‌మేట్ చేసే భావోద్వేగ అంశం రెండు పార్టీలకు అవసరమని బీజేపీ జాతీయ నాయకత్వం అభిప్రాయపడినట్లు సమాచారం.ఇటీవల విశాఖపట్నంలో పవన్‌కల్యాణ్‌తో జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశంపై చర్చించినట్లు సమాచారం.

అమరావతి రాజధాని అంశాన్ని టీడీపీ కంటే పవన్ కల్యాణ్ సమర్థంగా చేపట్టాలని ప్రధాని సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.అదే సమయంలో బీజేపీ కూడా అమరావతి రాజధాని అంశాన్ని పెద్దఎత్తున చేపట్టి పవన్ కళ్యాణ్‌కు అన్ని విధాలా అండగా ఉంటుంది.అమరావతికి మద్దతుగా కేంద్రం కూడా త్వరలోనే తన వైఖరిని స్పష్టం చేస్తుందని మోడీ చెప్పినట్లు తెలిసింది.బిజెపి, జనసేన పార్టీలు అమరావతి అంశాన్ని హైజాక్ చేసి ఎన్నికల ప్లాంక్‌గా మార్చగలిగితే, అది ఓటర్లపై చాలా ప్రభావం చూపుతుంది.







