వైరల్: కన్నబిడ్డ ప్రాణాలతో చెలగాటం ఆడిన తల్లి..!

కన్నబిడ్డ కు ఏ చిన్న గాయం కాకుండా చూడాల్సిన ఓ తల్లి ఏకంగా తన బిడ్డ ప్రాణాలను పణంగా పెట్టింది.

హరియాణా లోని ఫరీదాబాద్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

ఆ బిడ్డకు ఏమైనా జరిగితే పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.వివరాల్లోకి వెళ్తే.

తొమ్మిదవ ఫ్లోర్‌ లో దుస్తులు ఆరవేయగా.అవి గాలికి ఎగిరి, ఎనిమిదవ ఫ్లోర్ లోకి వచ్చి పడ్డాయి.

కాగా, దుస్తులను తీసుకొచ్చేందుకు వచ్చిన మహిళ.కింద ఫ్లాట్‌లో పడిపోయిన వస్త్రాలు మెట్లు దిగి వెళ్లి తెచ్చుకుంటే సరిపోయే దానికి.ఓ మహిళ నిర్లక్ష్యంగా వ్యవహరించి తన బిడ్డ ప్రాణాలను రిస్క్‌లో పెట్టింది.9వ ఫ్లోర్‌ బాల్కనీకి ఓ బెడ్‌షీట్‌ కట్టి తన బిడ్డను ఆ బెడ్ షీట్ ద్వారా కిందకు దించింది.ఆ చిన్నారి వెళ్లి కింద ఫ్లోర్ లో పడిన వస్త్రాలు తీసుకుని వచ్చి ఆ బెడ్‌షీట్‌ను పట్టుకోగానే మళ్లీ ఆమె పైకి లాగింది.

Advertisement

దీన్ని అంతా ఎదురు అపార్ట్‌మెంట్ లోని కొందరు వీడియో తీసి. సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు.ఇది చూసిన పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

కింద ఫ్లోర్‌కు వెళ్లే తెచ్చుకుంటే అయిపోయే దానికి అభం శుభం తెలియని చిన్నారి ప్రాణాలతో చెలగాటం ఆడడం దేనికని.ఆమెపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వ్యవహారం గురించి సదరు మహిళను ప్రశ్నించగా.తెలియక ఇలా చేసాను క్షమించండి.దీన్ని వీడియో తీస్తున్నారని నాకు తెలియదు’ అని ఆమె అన్నారు.

కాగా, మరికొందరు మాట్లాడుతూ.అంటే వీడియో తీస్తున్నారని తెలిస్తే.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

చేయకుండా ఉంటారు తప్ప.చిన్న పిల్లాడి మీద జాలి లేదా అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు