చిరంజీవికి సుకుమార్‌ పై కంటే కూడా వారిపై ఎక్కువ నమ్మకం

మెగాస్టార్ చిరంజీవి తో ( Chiranjeevi ) సినిమా చేయాలని ఎంతో మంది స్టార్ దర్శకులకు కూడా ఉంటుంది.

అందులో సుకుమార్( Sukumar ) కూడా ఒకరు అనడంలో సందేహం లేదు.

భారీ సక్సెస్ లను సొంతం చేసుకున్న దర్శకుడు సుకుమార్ తదుపరి సినిమా ఏంటి అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేక పోతున్నాడు.పుష్ప సినిమా కి( Pushpa ) దాదాపుగా రెండు పార్ట్‌ లు కలిపి మూడు సంవత్సరాలకు ఎక్కువగానే కేటాయించిన సుకుమార్ తదుపరి సినిమా విషయం లో నిర్ణయం తీసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి హీరోగా సుకుమార్ దర్శకత్వం లో ఒక సినిమా ఉంటుందనే ప్రచారం జరిగింది.కానీ సుకుమార్ నుండి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు.

పైగా చిరంజీవి కూడా ఈ ప్రాజెక్టు విషయం లో ఆసక్తి గా లేడు అనే ప్రచారం జరుగుతుంది.ఈ మధ్య కాలంలో మెగాస్టార్ చిరంజీవి ఎక్కువగా యంగ్ డైరెక్టర్స్ యొక్క కథలను మాత్రమే వింటున్నాడు.

Advertisement

చిన్న వయసు దర్శకులు అయితేనే తనను బాగా చూపిస్తారని భావిస్తున్నాడట.

అందుకే కొత్త దర్శకులకు మాత్రమే చిరంజీవి డేట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు అనే వార్తలు వస్తున్నాయి.అందులో భాగంగానే వరుసగా చిన్న హీరో దర్శకులకు డేట్ లు ఇవ్వడం తో పాటు వారి కథలను వింటున్నారని తెలుస్తుంది.మెగాస్టార్ చిరంజీవి కోసం చాలా సంవత్సరాల క్రితమే దర్శకుడు సుకుమార్ కథ ను రెడీ చేసుకున్నాడని వార్తలు వస్తున్నాయి.

అయినా కూడా సుకుమార్ పై చిరంజీవి ఆసక్తి చూపించడం లేదు అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

రంగస్థలం, పుష్ప వంటి భారీ పాన్ ఇండియా విజయాలు సొంతం చేసుకున్న సుకుమార్ ని చిరంజీవి నమ్మక పోవడం పట్ల మెగా అభిమానుల సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.మెగా ఫాన్స్ తో పాటు ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకులు కూడా దర్శకుడు సుకుమార్ తో చిరంజీవి సినిమా చేస్తే బాగుంటుందని అభిమానులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతానికి చిరంజీవి భోళా శంకర్ సినిమా ను చేసిన విషయం తెలిసిందే.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

ఆ సినిమా విడుదలైన తర్వాత తదుపరి సినిమా కు సంబంధించిన ఆలోచన ఉండే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు