భాజపాతో ఎన్నికల పొత్తుపై చంద్రబాబు( Chandrababu ) బహిరంగంగా ఓపెన్ అయ్యారు .మోదీపై( Modi ) ప్రశంసల వర్షం కురిపించారు .
ఒక జాతీయ ఛానల్ నిర్వహించిన కార్యక్రమం దీనికి వేదికగా మారింది .మోడీజీ విజన్ ఉన్న నాయకుడని అభివృద్ధి విషయంలో ఇద్దరి ఆలోచన విధానం ఒకలాగే ఉంటుందంటూ మోడీ విజన్ ( Modi’s vision )కు అనుగుణం గా తన స్థాయిలో పనిచేయడానికి తాను కూడా సిద్ధంగా ఉన్నానని ఆయన వ్యాఖ్యానించారు … గతంలో తాను మోడీ ని విమర్శించిన సందర్భం కూడా కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం పాలసీల పరం గా విభేదించానే తప్ప వ్యక్తిగతంగా ఆయన విజన్ పట్ల తనకు గౌరవం ఉందంటూ ఆయన చెప్పుకొచ్చారు .
ఇలా బిజెపితో( BJP ) కలిసి పని చేయడానికి తనకు ఇబ్బంది లేదన్న విషయాన్ని ఆయన ప్రకటించారని చెప్పవచ్చు అయితే బీజేపీతో కలిసి ఎన్నికలలో పోటీ చేయడానికి పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారా ? అన్న విలేకరుల ప్రశ్నకు మాత్రం ఆ విషయాలను ప్రకటించడానికి ఇది సరైన వేదిక కాదంటూ మరో సందర్భం లో దాని గురించి మాట్లాడదదామని ఆయన సమాదానం దాటవేశారు.అయినప్పటికీ బాజాపా తో పొత్తు విషయంలో తమ పార్టీ ఆసక్తిగా ఉందన్న విషయాన్ని పరోక్షంగా ఆయన ప్రకటించినట్లు అయిందని వార్తలు వస్తున్నాయి.
భాజపాతో స్నేహాన్ని తెచ్చుకోవడం రాజకీయంగా తమకు నష్టం తెచ్చిపెట్టిందన్న క్లారిటీ గత ఎన్నికలు ఫలితాలు వచ్చిన కొద్ది కాలంలోనే టిడిపి నాయకత్వానికి అర్థమైంది.దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ అవకాశాలు కలిసి రాలేదు.ఇప్పుడు మరో సంవత్సరంలో ఎన్నికల్లో ఉన్న దరిమిలా ఎన్డీఏతో స్నేహం కోసం టిడిపి నాయకత్వం సీరియస్గా ప్రయత్నిస్తుందన్న వార్తలు వస్తున్నాయి .తెలుగుదేశం అనేక మీడియా కోరుకుంటున్నట్లు భాజపా- జనసేన- తెలుగుదేశం పొత్తు కుదిరితే మాత్రం 2014 ఫలితాలను పునరావృతం చేయడం టిడిపికి కష్టం కాదని, ఒకసారి విజయం అంటూ వస్తే మరో 10 సంవత్సరాలకు సరిపడా పార్టీని నడపడానికి అవసరమైన జవసత్వాలను కూడగట్టుకోవచ్చని టిడిపి అదినాయకత్వం భావిస్తుందంటూ విశ్లేషణలు వస్తున్నాయి.