అప్ప‌ట్లో ప్రేక్ష‌కులు ప‌నులు మానుకుని చూసిన సీరియ‌ల్స్ ఇవే..

భారతీయ టెలివిజన్ చరిత్ర ఎంతో ఘ‌న‌మైన‌ది.ఇంటి పైకప్పుపై అమర్చిన యాంటెన్నాను ప్రతిష్టకు చిహ్నంగా భావించే కాలం మన దేశంలో ఒక‌ప్పుడు ఉంది.

ఇంట్లోని టెలివిజన్ ముందు కుటుంబం మొత్తం కలిసి కూర్చుని కార్య‌క్ర‌మాల‌ను చూసేవారు.ఆ రోజుల్లో దూరదర్శన్‌లో ప్రసారమయ్యే ఐదు ప్ర‌ముఖ టీవీ సీరియళ్ల‌ను ప్రేక్ష‌కులు త‌మ ప‌నులు మానుకుని మ‌రీ చూసేవారు.

అవేమిటో ఇప్పుడు చూద్దాం.శక్తిమాన్ శక్తిమాన్ .ఇది చాలా మంది పిల్లలను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది.నటుడు ముఖేష్ ఖన్నా నటన ఆ పాత్రను చిరస్థాయిగా నిలిపింది.శక్తిమాన్ భారతదేశపు మొదటి సూపర్ హీరో.చంద్రకాంత 1994లో మొద‌లైన ఈ సీరియ‌ల్‌లో విజయఘ‌ర్ యువరాణి చంద్రకాంత-నౌగర్ యువరాజు వీరేంద్ర సింగ్ కథను కళాత్మకంగా చిత్రీకరించారు.ఆదివారం ఉదయం వ‌చ్చే ఈ సీరియల్ చూసేందుకు జనాలు ఆసక్తిగా ఎదురుచూసేవారు.

చిత్రహార్‌ ప్రపంచ టెలివిజన్ చరిత్రలో చిత్రహార్ సుదీర్ఘ టెలికాస్ట్ ప్రోగ్రామ్.ఇది 1960లలో ప్రారంభమైంది.1970ల నాటికి ప్రజాదరణలో గరిష్ట స్థాయికి చేరుకుంది.ప్రతి శుక్రవారం ప్రైమ్ టైమ్‌లో దాదాపు 30 నిమిషాల పాటు సాగే ఈ కార్యక్రమంలో కొత్త, పాత బాలీవుడ్ పాటలు ప్లే చేసేవారు.

Advertisement

రామాయణం రామానంద్ సాగర్ సమర్పణలో వ‌చ్చిన‌ రామాయణం దేశంలోనే మొట్టమొదటి టీవీ సీరియల్.రామాయణంలోని కొన్ని ఎపిసోడ్‌లు ఎంత హత్తుకునేలా ఉండేవంటే.ప్రేక్ష‌కులు కన్నీళ్లు పెట్టుకునేవారు.

మ‌రికొంద‌రుల‌ ఈ టీవీ సీరియల్ పోస్టర్‌ను తమ ఇళ్లలో పెట్టుకుని పూజలు చేసేవారు.

మహాభారతం మహాభారతం సీరియల్ దూరదర్శన్‌లో ఎంతో సందడి చేసింది.ఈ సీరియల్‌లో పాండవులు-కౌరవుల మధ్య జరిగిన యుద్ధం ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది.

బర్త్ డే క్వీన్ నవీన రెడ్డి : మంచి పాత్రలు చేస్తూ ఇండస్ట్రీ లో స్టార్ ఇమేజ్ దక్కించుకున్న నటి...
Advertisement

తాజా వార్తలు