నకిలీ పైలట్ గుట్టురట్టు..ఏకంగా నలుగురు అమ్మాయిలతో ప్రేమాయణం..!

ప్రస్తుత కాలంలో కష్టపడకుండా డబ్బులు సంపాదించడం, అందమైన అమ్మాయిలను ప్రేమించి తమ చుట్టూ తిప్పుకోవడం కోసం కొందరు యువకులు ఎటువంటి పనులు చేయడానికి అయినా వెనుకాడడం లేదు.

ఈ క్రమంలో తమను తాము ధనవంతులుగా లేదంటే ప్రభుత్వ ఉద్యోగులుగా పరిచయం చేసుకొని అత్యంత దారుణంగా మోసాలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతోంది.

ఓ యువకుడు తనను తాను పైలట్ అని పరిచయం చేసుకొని ఏకంగా నలుగురు అమ్మాయిలను ప్రేమలోకి దించాడు.కానీ చివరకు అడ్డంగా దొరికిపోయాడు.

అతనికి సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

వివరాల్లోకెళితే.ముంబై( Mumbai ) కు చెందిన 20 ఏళ్ల యువకుడు రక్షిత్ మంగేలా పైలెట్ అవతారం ఎత్తి ఏకంగా నలుగురు అమ్మాయిలను ప్రేమలోకి దించాడు.తాజాగా శనివారం హైదరాబాదులో ఉన్న ప్రియురాలిని కలిసేందుకు వెళుతూ వడోదర ఎయిర్ పోర్ట్ లో ఉన్నత అధికారులకు చిక్కాడు.

Advertisement

బోర్డింగ్ సిబ్బందికి తాను ఎయిర్ ఇండియా పైలెట్ అంటూ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానంతో అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా నకలీ పైలెట్ గుట్టు రట్టయింది.దీంతో గుజరాత్ లో ఈ నకలీ పైలెట్ ను పోలీసులు అరెస్టు( Police ) చేశారు.

రక్షిత్ మంగేలా పై హర్ని ఠాణా లో కేసు నమోదు చేసిన పోలీసులు.ఇతడికి రాజ్కోట్, అహ్మదాబాద్, ముంబై, నెదర్లాండ్స్ లలో స్నేహితురాళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.అందమైన అమ్మాయిలను ప్రేమలో పడేసేందుకే ఇలా నకలీ పైలెట్ అవతారం ఎత్తాడు.

తాను నిజమైన పైలట్ కాదని రక్షిత్( Rakshit ) తోనే అతడి స్నేహితురాళ్లకు మెసేజ్ పెట్టించారు.అయితే పైలెట్ కావాలని రక్షిత్ ఎన్నో కలలు కన్నాడు.ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆ కోరిక తీర్చుకోలేకపోయాడని పోలీసులు వెల్లడించారు.

రక్షిత్ కు కౌన్సిలింగ్ ఇచ్చి అతని కుటుంబ సభ్యులను పిలిచి అతన్ని అప్పగించారు.

కేసీఆర్ కవిత సైలెన్స్ .. బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది ? 
Advertisement

తాజా వార్తలు