తొమ్మిదో తరగతిలో ఫెయిల్.. ప్రస్తుతం దేశంలో గొప్ప వ్యాపారవేత్త.. రాజేష్ గాంధీ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

సాధారణంగా చదువులో ఫెయిల్ అయిన వాళ్లు ఇతర రంగాల్లో కూడా సక్సెస్ సాధించడం సులువు కాదు.

అయితే చదువులో ఫెయిల్ అయినా ఒక వ్యక్తి మాత్రం దేశంలోనే గొప్ప వ్యాపారవేత్తగా నిలిచారు.

రాజేష్ గాంధీ ( Rajesh Gandhi )సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుంది.వాడిలాల్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ అయిన రాజేష్ గాంధీ సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుంది.చదువులో వెనుకడినా సక్సెస్ సాధించవచ్చని రాజేష్ గాంధీ ప్రూవ్ చేశారు.1907 సంవత్సరంలో వాడిలాల్ గాంధీ ఈ ఐస్ క్రీం సంస్థను స్థాపించగా చిన్న వీధి సోడా దుకాణంతో ప్రారంభమైన ఈ సంస్థ విలువ ప్రస్తుతం 1843 కోట్ల రూపాయలుగా ఉంది.అహ్మదాబాద్ లోని సెయింట్ జేవియర్స్ హై స్కూల్ లో రాజేష్ గాంధీ చదువుకున్నారు.

ఆ స్కూల్ లో తొమ్మిదో తరగతి ఫెయిలైన రాజేష్ తండ్రి పట్టుబట్టడంతో అదే స్కూల్ లో మళ్లీ తొమ్మిదో తరగతి చదివాడు.

రాజేష్ గాంధీ కంపెనీ బాధ్యతలు తీసుకున్న తర్వాత వాడీలాల్ కంపెనీకి( Vadilal Company ) సంబంధించిన అవుట్ లెట్ల సంఖ్య అంతకంతకూ పెరిగింది.పొరుగు రాష్ట్రాలకు సైతం విస్తరించి కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించింది.ప్రముఖ ఆహార, పానీయాల కంపెనీలలో ప్రస్తుతం ఈ సంస్థ కూడా ఒకటిగా ఉంది.1990 సంవత్సరంలో రాజేష్ గాంధీ ఈ కంపెనీని ప్రాసెస్డ్ ఫుడ్ పరిశ్రమలోకి తీసుకొచ్చారు.

Advertisement

ఈ సంస్థ ప్రస్తుతం వేర్వేరు ఫ్లేవర్లలో కోన్ లు, క్యాండీలు, బార్ లు, కప్పులు, ఫ్యామిలీ ప్యాక్ లకు సంబంధించి వేర్వేరు రూపాలలో అందిస్తుండటం గమనార్హం.రాజేష్ గాంధీ గొప్ప వ్యాపారవేత్తగా కెరీర్ పరంగా మరింత ఎదగాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.ఆయన సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిని కలిగిస్తోంది.

పరీక్షల్లో ఫెయిలైనా కెరీర్ పరంగా అద్భుతాలు సాధించవచ్చని రాజేష్ గాంధీ ప్రూవ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు