ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పులపై వాస్తవాలు చెప్పాలి..: యనమల

ఏపీ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి టీడీపీ నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు.

గత ప్రభుత్వం కంటే తక్కువ అప్పులు చేశామని, నిబంధనలు పాటించామని ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం చెప్తున్న అంశాలను ప్రశ్నిస్తూ యనమల లేఖ రాశారని తెలుస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వ ఫైనాన్సియల్ ఇన్డిసిప్లెయిన్ పై కాగ్ నివేదిక అంశాలను యనమల లేఖలో ప్రస్తావించారు.ఈ క్రమంలోనే కాగ్ నివేదికలో ప్రస్తావించిన అంశాల ఆధారంగా చేసిన అప్పులు, తప్పులపై సర్కార్ వాస్తవాలు చెప్పాలని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేస్తూ కాగ్ కు తప్పుడు సమాచారం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జరిపిన లావాదేవీలను ప్రశ్నించారు.ఈ వివరాలపై ప్రభుత్వ పరంగా పూర్తి సమాధానం చెప్పాలని యనమల లేఖలో డిమాండ్ చేశారు.

ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ డిమాండ్స్ నెట్టింట వైరల్.. ఆమె డిమాండ్లు ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు