ప్రపంచంలో ఎన్నో డేటింగ్ యాప్ లు, బోలెడన్ని సామాజిక మాధ్యమాలు.ఉన్నాయి అయినప్పటికీ బ్రిటన్ కు చెందిన అల్లెన్ కు ప్రేమించడానికి ఒక అమ్మాయి కూడా దొరకలేదు, వృత్తి రీత్యా లారీ డ్రైవర్ అయిన అల్లెన్ గత 10 ఏళ్ళు గా అమ్మాయి కోసం చూడని యాప్ లేదు, చేయని ప్రయత్నం లేదు.
రాత్రి, పగలు వెతికినా అల్లెన్ కు ఒక్క అమ్మాయితో కూడా జత కుదరలేదు.దీంతో విసిగిపోయిన అల్లెన్ చివరకు ఒక నిర్ణయానికి వచ్చాడు.
తనను తానే అమ్ముకోవాలని నిర్ణయించుకున్నాడు, ఈ మేరకు ఫేసుబుక్ క్లాసిఫైడ్స్ లో ఇలా ప్రకటన ఇచ్చాడు.
“నా పేరు అల్లెన్.
వయసు 30 సంవత్సరాలు, అందమైన అమ్మాయి కోసం వెతుకుతున్న.మరికొద్ది రోజుల్లో చాలా వేడుకలకు వెళ్లాల్సి ఉంది, కాబట్టి ఒక్కడినే వెళ్ళాలి అనుకోవటం లేదు.
డేటింగ్ సైట్ లలో అమ్మాయి కోసం చాలా ప్రయత్నాలు చేసాను, కానీ ఏది కుదరలేదు.అందుకే ఈ ప్రకటన చేస్తున్నాను అని రాసుకొచ్చాడు.
అయితే ఈ ప్రకటన తన తండ్రి ఫ్రాంక్ ను ఆశ్చర్యపరిచింది.అయితే తన కొడుకు మంచివాడు అని వంట చాలా బాగా చేస్తాడు అని కితాబిచ్చాడు.మరి తండ్రి మాట వినైన ఓ అమ్మాయి అల్లెన్ కు ఐ లవ్ యుచెపుతుందో లేదో చూడాలి