ఆయన రాజకీయాల్లో గండర గండుడు.గత 40 ఏండ్లుగా రాజకీయ చాణక్యుడిగా రాణిస్తున్నారు.
ఎన్నో పదవులు స్వకరించారు.ఆయన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్నడూ ఉన్నత స్థాయిలోనే ఉన్నారు.
కానీ గత చరిత్రలో ఎన్నడూ లేనన్ని పరాభవాలు, అవమానాలు ఈ 2021లోనే ఎదురయ్యాయి.ఇంకా చెప్పాలంటే ఏడిపించేసింది కూడా.ఇప్పటికే ఆయన ఎవరో మీకు అర్థం అయే ఉంటుంది.ఆయనేనండి నారా చంద్రబాబు నాయుడు.
రాజకీయాల్లో సుడులు తిరిగిన నేతగా ఉన్నారు.కానీ ఇన్నేండ్లలో ఎన్నడూ లేనంత బాధను ఈ ఏడులోనే అనుభవించారు.
యవ్వన దశలో, మధ్య వయస్సులో ఎన్నో పదవుల్లో ఉన్న చంద్రబాబు.ఇన్నేండ్ల వృద్ధాప్యంలో దాదాపు ఏడు పదుల వయసులో ఏడ్చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.2021 చంద్రబాబు జీవితంలోనే ఓ చేదు సంవత్సరంగా మిగిలిపోయింది.నిజం చెప్పాలంటే ఆయన బాధ పడటం 2019 ఎన్నికల నుంచే మొదలయింది.
టీడీపీ చరిత్రలోనే ఎన్నడూ లేనంత దారుణమైన ఓటమిని చవిచూసింది.ఈ ఓటమి బాబును తీవ్రంగా కుంగదీసింది.
అప్పటి నుంచే అటు అసెంబ్లీలో, ఇటు బయటా ఆయనకు అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి.

ఇక 2021లో జరిగిన అన్ని ఎన్నికల్లో చిత్తు చిత్తుగా పార్టీ ఓడిపోవడం మరింత దెబ్బ తీసింది.అన్నింటి కంటే ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో అన్ని ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగిరింది.బాబు పట్టు కోల్పోయారు.ఇది ఆయన ఉనికినే ప్రశ్నించేలా మారింది.ఉప ఎన్నికల్లో, పరిషత్, మున్సిపాలిటీ ఇలా ఏ ఎన్నిక వచ్చినా సరే చంద్రబాబు చిత్తు చిత్తుగా ఓడిపోతూనే ఉన్నారు.ఇక అసెంబ్లీ ఘటన అన్నింటికంటే దారుణం అని తమ్ముళ్లు భావిస్తున్నారు.ఏకంగా అసెంబ్లీనే బహిష్కరించారు చంద్రబాబు.
ఇలా ఈ ఏడు అన్ని విధాలుగా ఆయన నష్టపోయారు.మరి రాబోయే 2022 అయినా చంద్రబాబుకు కలిసి వస్తుందో లేదో చూడాలి.