బాలీవుడ్ మొత్తం వారం రోజుల కిందట నుంచీ ఒకే విషయం మీద చర్చిస్తోంది.ఇప్పుడు ఉన్న హీరోయిన్ లు అందరిలో సీనియర్ అయిన కరీనా కపూర్ ఆమె.15 సంవత్సరాలు గా బాలీవుడ్ లో ఉంటూ వన్నె తగ్గని భామగా పేరు తెచ్చుకున్న కరీనా తన కొత్త సినిమా ‘కీ కా’ కోసం వింత పనులు అన్నీ చేస్తోంది.ఈ సినిమా లో తనకంటే చిన్నోడు అయిన కుర్ర హీరో అర్జున్ కపూర్ తో ఆమె రెచ్చిపోయి మరీ నటించడం వివాదాస్పదం , సినిమాకి కావలసినంత పబ్లిసిటీ గా మారుతోంది.
ఈ సినిమాలో కరీనా విపరీతంగా రెచ్చిపోయింది .బెడ్ రూమ్ సీన్ లూ, లిప్ లాక్ లూ అయితే ఇక తిరుగే లేదు.ఇంతకుముందు కరీనాకపూర్ కంబక్త్ ఇష్క్ లో అక్షయ్ కుమార్ తో సుమారు 4 హాట్ లిప్ లాక్ సీన్స్ లో నటించగా అదే ఆమె కెరీర్ లో హైయెస్ట్.కాగా ఇప్పుడు ఏకంగా ఇందులో 15 లిప్ లాక్ సీన్స్ లో నటించిందని బీటౌన్ లో హాట్ గా చర్చలు జరుగుతున్నాయి.
సినిమాలో మొగుడుపెళ్ళాలుగా నటిస్తున్న అర్జున్ కపూర్-కరీనాకపూర్ ల ఈ హాట్ లిప్ లాక్ సీన్స్ సినిమాకే మేజర్ హైలెట్ అవుతాయని అంటున్నారు.విడుదలకి ముందే కరీనాకపూర్ లిప్ లాక్స్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమాతో కరీనా క్రేజ్ అమాంతం పెరగడం ఖాయమట.
అయితే పెళ్ళయ్యి మొగుడు ఉన్నా కూడా ఇవన్నీ ఏంటి అంటున్నారు విశ్లేషకులు.







