టాలీవుడ్‌లో వచ్చిన మల్టీస్టారర్ చిత్రాల్లో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఫుల్టూ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ‘ఎఫ్-2’ అదిరిపోయే బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది.ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్‌లు హీరోలుగా నటించిన సంగతి తెలిసిందే.
వారు ఈ సినిమాలో చేసిన సందడిని ప్రేక్షకులు ఇంకా గుర్తించుకున్నారు.కాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా ఎఫ్-3 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి.
ఇటీవల ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది.
కాగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.
ఈ సినిమాను ఆగస్టు 27న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.ఈ మేరకు అఫీషియల్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.
ఇక ఈ సినిమాతో మరోసారి ఎఫ్-2 లాంటి సక్సెస్‌ను అందుకునేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ మరో స్టార్ హీరో సినిమాకు దెబ్బేసేలా కనిపిస్తుంది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప’ సినిమాను ఆగస్టు 13న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.దీంతో ఈ సినిమా లాంగ్ రన్‌ను ఎఫ్-3 దెబ్బేయడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.
మొత్తానికి పుష్ప లాంగ్ రన్‌పై ఎఫ్-3 చిత్రం ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.కాగా ఈ ఎఫ్-3 సినిమాలో కూడా ఎఫ్-2 హీరోహీరోయిన్లు నటిస్తుండటంతో ఈ సినిమాను అతి త్వరలో పూర్తి చేసేందుకు అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడు.
ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమా రిలీజ్ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.మరి ఆగస్టులో ఏయే సినిమాలు రిలీజ్ అవుతాయో తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే.
ఇక ఎఫ్-2 కథను పెళ్లాల కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తే, ఎఫ్-3 కథను డబ్బు కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తు్న్నారు చిత్ర యూనిట్.