ఎఫ్ 3 సినిమాకి వసూళ్లు రాకపోవడానికి కారణం ఇదేనట!

వెంకటేష్.వరుణ్‌ తేజ్ లు కలిసి నటించిన ఎఫ్ 3 సినిమా కలెక్షన్స్‌ విషయంలో ఇన్నాళ్లు ఉన్న సస్పెన్స్ కు తెర పడ్డట్లు అయ్యింది.

అసలు ఈ సినిమా ఎంత వసూళ్లు సాధించింది అనేది అధికారికంగా దిల్‌ రాజు టీమ్‌ ప్రకటించలేదు.కాని మనకు అందిన సమాచారం ప్రకారం ఎఫ్ 2 వసూళ్లు చేసిన మొత్తంలో కనీసం 60 శాతం కూడా రాబట్టలేదట.

ఎఫ్ 3 సినిమాకు పాజిటివ్ టాక్‌ వచ్చినా కూడా వసూళ్లు రాకపోవడం విడ్డూరంగా ఉందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.గతంతో పోల్చితే టికెట్ల రేట్లు అధికంగా ఉన్నాయి.

సినిమా మేకింగ్ కోసం కూడా ఎక్కువ ఖర్చు చేశారు.అయినా కూడా ఎఫ్ 3 సినిమా వసూళ్లు రాబట్టలేక పోయింది అంటూ విమర్శలు వస్తున్నాయి.

Advertisement

ఎఫ్ 3 సినిమా లో కలర్‌ ఫుల్‌ గా ముగ్గురు హీరోయిన్స్‌ ఇద్దరు హీరోలు.లెక్కకు మించి సీనియర్‌ నటీ నటులు ఉన్నారు.

అయినా కూడా ప్రేక్షకులు ఎందుకు థియేటర్‌ ల వద్దకు రాలేదు అంటే కరోనా తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకు దూరం అయ్యారు.టికెట్ల రేట్లు విపరీతంగా పెరగడంతో పాటు గతంలో మాదిరిగా ఎక్కువ తక్కువ సినిమాలను ఫ్యామిలీ ఆడియన్స్‌ చూసేందుకు ఇష్టపడటం లేదు.

అందుకే ఎఫ్ 3 సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేక పోయింది అంటూ టాక్‌ వినిపిస్తుంది.సినిమా లో అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్ ఉన్నా కూడా ప్రేక్షకులు సినిమాను చూసేందుకు క్యూ కట్టలేదు.

కాని అదే ప్రేక్షకులు ఇప్పుడు సినిమా ఎప్పుడు ఓటీటీ లో స్ట్రీమింగ్‌ అవుతుందా అంటూ ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా ను విడుదలైన 50 రోజుల తర్వాత కాని స్ట్రీమింగ్‌ చేసేది ఏలదు అంటూ యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

 ఎఫ్ 3 సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ విషయం లో నిర్ణయం ఏమైనా మార్చుకునే అవకాశం ఉందా అంటూ కొందరు ఎదురు చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు