ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి తీవ్ర అన్యాయం.. ఎంపీ విజయసాయిరెడ్డి

ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.

దాదాపు పది సంవత్సరాల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని నాడు వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారని తెలిపారు.

పార్టీలు, ప్రభుత్వాలు ఎన్ని మారినా ఇచ్చిన హామీ నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.అదేవిధంగా రాజధానిగా ఏ ప్రాంతం ఉండాలో ప్రజలు నిర్ణయించుకుంటారని తెలిపారు.

అభివృద్ధి వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.అందుకే ఏపీకి మూడు రాజధానులను ప్రతిపాదించామని వెల్లడించారు.

రాజధాని అనేది రాష్ట్రాలకు సంబంధించిన అంశమని తెలిపారు.మెట్రో విషయంలో ఏపీపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని విమర్శించారు.

Advertisement
ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు