ఇద్దరి కుటుంబాల్లో విషాదం నింపిన వివాహేతర సంబంధం.. !

ఈ మధ్యకాలంలో జరుగుతున్న హత్యలను గానీ, ఆత్మహత్యలను గానీ పరిశీలిస్తే ఎక్కువగా వివాహేతర సంబంధాల వల్ల చోటు చేసుకుంటున్నాయని తెలుస్తుంది.

ఆనందంగా సాగుతున్న కాపురాల్లో అర్దాంతరంగా ప్రవేశిస్తున్న ఈ ఇల్లీగల్ ఎఫైర్స్ వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారు ఎక్కువగానే కనిపిస్తున్నారు.

ఇలాంటి చర్యల వల్ల వీరినే నమ్ముకున్న కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంటుంది.కాగా తాజాగా నిజామాబాద్ జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే ఇద్దరి ప్రాణాలను బలిగొంది.

Extramarital Affair Took The Lives Of That Two , Nizamabad, Extramarital Affair

ఆ వివరాలు చూస్తే.ఆర్మూర్ మండలం ఆలూరు గ్రామానికి చెందిన చిత్తూరి సాయిలుకు అదే గ్రామానికి చెందిన శైలజ అనే మహిళతో గత కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతుందట.

ఈ విషయం తెలిసిన వీరి ఇళ్లల్లో గత కొన్ని రోజుల నుండి గొడవలు కూడా జరుగుతున్నాయట.దీంతో మనస్దాపానికి గురైన సాయిలు, శైలజ ఇద్దరు కలిసి నిన్న సికింద్రాపూర్ గ్రామానికి చేరుకుని, ఈ గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా సమాచారం.

Advertisement

అయితే మృతుడు సాయిలు హనుమాన్ మాలలో ఉండి, ఆత్మహత్యకు పాల్పడడం విచారకరమని గ్రామస్థులు వెల్లడిస్తున్నారు.ఇకపోతే ఈ మరణాలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తూ ప్రారంభించారు.

వామ్మో.. బన్నీకి జోడీగా అంతమంది హీరోయిన్లా.. కొత్త రికార్డ్ క్రియేట్ చేయనున్నారా?
Advertisement

తాజా వార్తలు