అషు రెడ్డి క్యారెక్టర్ గురించి సీక్రెట్స్ చెప్పిన ఎక్స్ ప్రెస్ హరి.. ఆమె రియాక్షన్ ఏంటంటే?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

అషు రెడ్డి కమెడియన్ ఎక్స్ ప్రెస్ హరి తో కలసి బుల్లితెరపై ఏ రేంజ్ లో సందడి చేస్తుందో మనందరికీ తెలిసిందే.

కామెడీ స్టార్స్ లో వీరిద్దరు కలసి చేసే రచ్చ మామూలుగా ఉండదు.అంతేకాకుండా అషు రెడ్డి పేరును టాటూ వేయించుకుని హరి బుల్లి తెరపై మరింత సెన్సేషన్ క్రియేట్ చేశాడు.

మరి హరి వేయించుకున్న టాటూ నిజమా అబద్దమా అన్నది ఇప్పటికి తెలియలేదు.కానీ టాటూ మాత్రం ఎపిసోడ్ ను హైలెట్ చేయడంతో పాటు, ఆ జంట ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యారు.

ఎపిసోడ్ తర్వాత అషు రెడ్డి, ఎక్స్ ప్రెస్ హరి ఫై భారీగా రూమర్స్ వచ్చాయి.అంతేకాకుండా ఇద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారు అంటూ పెద్ద ఎత్తున గ్రాసిప్స్ వినిపించాయి.

Advertisement

కానీ ఆ జంట మాత్రం వారిద్దరూ కేవలం స్నేహితులమే అని ఇప్పటికే పలుసార్లు క్లారిటీ ఇచ్చారు.కానీ ఆన్ స్క్రీన్ లో మాత్రం ఈ జోడి కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయింది.

ఇది ఇలా ఉంటే తాజాగా హరి తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా షేర్ చాట్ చేశారు.ఇందులో భాగంగానే హరికి అషు రెడ్డికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి.

అషు రెడ్డి కి నీకు ఉన్న రిలేషన్ ఏంటి? ఆమె మీద నీకు ఉన్న అభిప్రాయం ఏంటి? అంటూ నెటిజెన్స్ హరిని ప్రశ్నించగా.అందుకు హరి ఈ విధంగా సమాధానం ఇచ్చాడు.

అషు రెడ్డి గురించి చెప్పాలంటే నాకున్న డేటా బ్యాలెన్స్ సరి పోదు బ్రో.సింపుల్ గా చెప్తా.అందంగా ఉన్న అమ్మాయిలు ఉంటారు.మంచిగా ఉన్న అమ్మాయిలు ఉంటారు.

కుమార్తె వ్యాఖ్యలు.. వేదికపై కంటతడి పెట్టిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
బీట్‌రూట్ ఆకుల‌తో ఇలా చేస్తే.. ఊడిన జుట్టు మ‌ళ్లీ వ‌స్తుంది!

కానీ అందంగా ఉండి.మంచితనం ఉన్న అమ్మాయిలు అషు ల చాలా తక్కువ మంది ఉంటారు అంటూ సమాధానం ఇచ్చారు ఎక్స్ ప్రెస్ హరి.హరి చెప్పిన విషయం పై స్పందించిన అషు రెడ్డి అందులో ఉన్న మాటలు పట్టించుకోకుండా.అందులో ఉన్న తప్పు నుంచి డేట్ కాదు డేటా అని చెప్పుకొచ్చింది.

Advertisement

ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తాజా వార్తలు