ఒకప్పుడు భారతీయ రాష్ట్ర సమితి పార్టీలో నెంబర్ టూ అంటే ఈటెల పేరే ప్రముఖంగా వినిపించేది.పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేత కావడం ,బీసీ నేత కావడం, సౌమ్యుడు గా పేరు గాంచాడం , కార్యకర్తలకు అందుబాటులో ఉంటాడన్న పేరు వెరసి ఆయన ప్రభ పార్టీ లో ఒక స్తాయి లో వెలిగేది .
ఈ స్తాయి లో పేరు గడించిన ఈటెల రాజేందర్( Etela Rajendar ) బీఆరఎస్ పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చారన్నది సగటు తెలంగాణ ప్రజలకు అర్థం కాలేదు.ఆయన పై భూ ఖబ్జా ఆరోపణలు రావడం , ప్రభుత్వం ఆయన మీద విచారణ కు ఆదేశించడం పార్టీ నుండి బహిష్కరించడం ఇలా నాటకీయ పరిణామాల మధ్య ఆయన బయటకు వచ్చారు.

ఆయన బయటికి వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం( KCR Govt ) ఆయనపై కక్ష తీర్చుకోవడానికి చూడటం, ఆయన తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి భాజపాలో( BJP ) జాయిన్ అవ్వడం ఇలా శరవేగం గా పరిణామాలు జరిగాయి .అయితే ఆయన పార్టీని వదిలి వేయడానికి గల కారణాలు మాత్రం ఇంతవరకు ఆయన ఎక్కడా చెప్పలేదుఅయితే ఎట్టకేలకు తనను బారాసాన్నించి తప్పించడానికి గల కారణాలను తెలంగాణ ప్రజలకు వివరించారు ఈటెల .అసెంబ్లీ ఎన్నికల ప్రచార సందర్భంగా మెదక్ లో( Medak ) జరిగిన కార్యక్రమంలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.ఒకప్పుడు తనను కేసీఆర్ లెఫ్ట్ హ్యాండ్ అనే వారని చివరికి సొంత మనుషులకు అడ్డు వస్తాననే భయంతో తనను పార్టీ నుంచి గెట్టేశారని,

తాను ఎవరికీ అడ్డం కాదని చెప్పినా వినిపించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అంతేకాకుండా తనను వార్డు మెంబర్గా కూడా గెలవలేనని పార్టీ పెద్దలు అవహేళన చేశారని ఆ రోషం తోనే పార్టీ కి రాజీనామా చేసి బయటకు వచ్చానని, హుజురాబాద్ లో( Huzurabad ) గెలిచి తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాను అన్నారు .తద్వారా తాను ఎవరి ఫోటో పెట్టి గెలవలేదని తేల్చి చెప్పినట్లు అయిందని ఈటెల చెప్పుకొచ్చారు.దీంతో చాలాకాలం తర్వాత ఆయన తన మనసులో మాటను చెప్పినట్లయ్యింది .ఈ సారి ఆయన హుజురాబాద్ తో పాటు గజ్వేల్ లో కేసీఆర్ పై కూడా పోటీ చేస్తున్నారు.ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ను ఓడిస్తానన్న ధీమాను ఈటెల వ్యక్తం చేస్తున్నారు.