అడ్డొస్తున్నాననే తరిమేశారు : కెసిఆర్ పై ఈటెల ఫైర్ !

ఒకప్పుడు భారతీయ రాష్ట్ర సమితి పార్టీలో నెంబర్ టూ అంటే ఈటెల పేరే ప్రముఖంగా వినిపించేది.

పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేత కావడం ,బీసీ నేత కావడం, సౌమ్యుడు గా పేరు గాంచాడం , కార్యకర్తలకు అందుబాటులో ఉంటాడన్న పేరు వెరసి ఆయన ప్రభ పార్టీ లో ఒక స్తాయి లో వెలిగేది .

ఈ స్తాయి లో పేరు గడించిన ఈటెల రాజేందర్( Etela Rajendar ) బీఆరఎస్ పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చారన్నది సగటు తెలంగాణ ప్రజలకు అర్థం కాలేదు.

ఆయన పై భూ ఖబ్జా ఆరోపణలు రావడం , ప్రభుత్వం ఆయన మీద విచారణ కు ఆదేశించడం పార్టీ నుండి బహిష్కరించడం ఇలా నాటకీయ పరిణామాల మధ్య ఆయన బయటకు వచ్చారు.

"""/" / ఆయన బయటికి వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం( KCR Govt ) ఆయనపై కక్ష తీర్చుకోవడానికి చూడటం, ఆయన తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి భాజపాలో( BJP ) జాయిన్ అవ్వడం ఇలా శరవేగం గా పరిణామాలు జరిగాయి .

అయితే ఆయన పార్టీని వదిలి వేయడానికి గల కారణాలు మాత్రం ఇంతవరకు ఆయన ఎక్కడా చెప్పలేదుఅయితే ఎట్టకేలకు తనను బారాసాన్నించి తప్పించడానికి గల కారణాలను తెలంగాణ ప్రజలకు వివరించారు ఈటెల .

అసెంబ్లీ ఎన్నికల ప్రచార సందర్భంగా మెదక్ లో( Medak ) జరిగిన కార్యక్రమంలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఒకప్పుడు తనను కేసీఆర్ లెఫ్ట్ హ్యాండ్ అనే వారని చివరికి సొంత మనుషులకు అడ్డు వస్తాననే భయంతో తనను పార్టీ నుంచి గెట్టేశారని, """/" / తాను ఎవరికీ అడ్డం కాదని చెప్పినా వినిపించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాకుండా తనను వార్డు మెంబర్గా కూడా గెలవలేనని పార్టీ పెద్దలు అవహేళన చేశారని ఆ రోషం తోనే పార్టీ కి రాజీనామా చేసి బయటకు వచ్చానని, హుజురాబాద్ లో( Huzurabad ) గెలిచి తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాను అన్నారు .

తద్వారా తాను ఎవరి ఫోటో పెట్టి గెలవలేదని తేల్చి చెప్పినట్లు అయిందని ఈటెల చెప్పుకొచ్చారు.

దీంతో చాలాకాలం తర్వాత ఆయన తన మనసులో మాటను చెప్పినట్లయ్యింది .

ఈ సారి ఆయన హుజురాబాద్ తో పాటు గజ్వేల్ లో కేసీఆర్ పై కూడా పోటీ చేస్తున్నారు.

ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ను ఓడిస్తానన్న ధీమాను ఈటెల వ్యక్తం చేస్తున్నారు.

సూర్య కంగువ సినిమాలో ఎన్ని పాత్రల్లో నటిస్తున్నాడో తెలుసా..?