టీఆర్ఎస్ పై ఈటల షాకింగ్ కామెంట్స్.. !

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి తిరుగు లేదని, కారుకు అడ్డువచ్చి గెలవడం కష్టం అని ఇప్పటి వరకు ఆ పార్టీనేతలతో పాటుగా పెద్ద బాస్, చిన్న బాస్ ధీమాతో ఉండే వారు.

కానీ పొమ్మనలేక పొగ పెట్టినట్లుగా ఈటల పరువుకు తూట్లు పొడిచి గులాభి కండువాను లాగేసుకున్నారట.

దీంతో హర్ట్ అయిన ఈటల నీ పార్టీ వద్దు, నువ్వు వద్దంటూ టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి తాజాగా కమళం చేత పట్టిన విషయం తెలిసిందే.అప్పటి నుండి వేయ్యి ఏనుగుల బలాన్ని తెచ్చుకున్నట్లుగా ప్రవర్తిస్తున్న ఈటల తాజాగా టీఆర్ఎస్ పార్టీ పై షాకింగ్ కామెంట్స్ చేశారు నాకు గుర్తింపు వచ్చిందే టీఆర్ఎస్ తో అంటూ కారు కూతలు కూస్తున్నారు.

అలాంటి వారు వినండి పార్టీ తరపున ఒక్క సారి గెలుస్తాము కానీ కానీ రెండవ సారీ గెలవడం కష్టం.అలాంటిది ప్రజల అభిమానంతో ఇప్పటి వరకు కొనసాగానని వెల్లడించారు.

ఇకపోతే రాబోయే రోజుల్లో చీకటి కాలానికి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరిస్తూ, 2023 తరువాత టీఆర్ఎస్ ఓటమి ఖాయమని, దొరల పాలనకు చరమ గీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పేర్కొన్నారు.

Advertisement
బైక్‌పై వెళ్తున్నాడా.. లేక నిద్రపోతున్నాడా? కుక్క మాత్రం ఏం చేసిందో చూడండి!

తాజా వార్తలు