ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో( Reliance Jio ) తన కస్టమర్లకు తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది.30 రోజుల హై-స్పీడ్ ఇంటర్నెట్, కాల్స్‌ను ఫ్రీగా అందిస్తున్నట్లు ప్రకటించింది.
జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌కు( Jio Fiber Broadband ) సభ్యత్వం పొందిన వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.అది కూడా 12-నెలల ప్రీపెయిడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ తీసుకున్న వారికే అందుబాటులో ఉంటుంది.12-నెలల ప్రీపెయిడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ధర రూ.4,788గా కంపెనీ నిర్ణయించిందని గమనించాలి.ఈ ప్లాన్ మొత్తం 360 రోజుల వ్యవధిలో 30mbps డౌన్లోడ్, అప్లోడ్ స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తుంది, అన్లిమిటెడ్ డేటా, ఫ్రీ కాలింగ్ ఫెసిలిటీని కూడా ఆఫర్ చేస్తుంది.
వినియోగదారులు 6 నెలల ప్రీపెయిడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌కు సబ్‌స్క్రైబ్ చేయడం ద్వారా 15 రోజుల ఉచిత సేవను( Free Data ) కూడా పొందవచ్చు, దీని ధర రూ.2,394.రిలయన్స్ జియో వినియోగదారులను లాంగ్ టర్మ్ ప్లాన్ల వైపు ఆకర్షించడానికి, డబ్బు ఆదా చేయడానికి ఈ ఆఫర్లను కంపెనీ ప్రకటించింది.
కస్టమర్ బేస్‌ను ఆకర్షించడం ద్వారా కంపెనీ తన ఆదాయాన్ని పెంచుకోవాలని ఆశిస్తోంది.సరసమైన బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కోసం చూస్తున్నట్లయితే, రిలయన్స్ జియో ఆఫర్ గొప్ప ఎంపిక అవుతుంది.30 రోజుల ఫ్రీగా ఇంటర్నెట్ కూడా పొందొచ్చు కాబట్టి డబ్బులు ఆదా చేసుకోవచ్చు.నచ్చితే ఈ ప్లాన్ మళ్లీ తీసుకోవచ్చు.
మొబైల్ రీఛార్జ్ ప్లాన్లతో పోలిస్తే జియో ప్రీపెయిడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్( Jio Prepaid Broadband Plans ) చాలా తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు.12-నెలల ప్రీపెయిడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ధర రూ.4,788 ఉంటుంది కాబట్టి మీకు నెలకు సుమారు రూ.399 మాత్రమే ఖర్చవుతుంది.ఈ తక్కువ ఖర్చుతోనే నెల అంతా అన్లిమిటెడ్ డేటా పొంది ఓటీటీ సినిమాలు హై క్వాలిటీ లో చూసుకోవచ్చు.
డేటా అయిపోతుందని ఆందోళన ఉండాల్సిన అవసరం లేదు.యూట్యూబ్ క్రియేటర్స్‌కి కూడా ఈ ప్లాన్ ఉత్తమంగా నిలుస్తుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy