టీ20 వరల్డ్ కప్‎లో న్యూజిలాండ్‎పై ఇంగ్లండ్ విజయం

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ విజయం సాధించింది.న్యూజిలాండ్ జట్టుకు తొలి ఓటమి ఎదురైంది.

సూపర్-12 దశలో భాగంగా జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు 20 పరుగుల తేడాతో గెలుపొందింది.బ్రిస్బేన్ లో జరిగిన ఈ గ్రూప్-1 మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 179 పరుగులు చేసింది.

అనంతరం 180 పరుగుల లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు చేసింది.దీంతో ఇంగ్లండ్ గ్రూప్-1 పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి చేరింది.

ఇంగ్లండ్ ఇప్పటిదాకా 4 మ్యాచ్ లు ఆడి రెండు విజయాలు సాధించింది.ఈ గ్రూప్ లో న్యూజిలాండ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Advertisement
చైనా: యూట్యూబర్‌కు షాకింగ్ అనుభవం.. మంటలు షూట్ చేసిన రోబో డాగ్‌..?

తాజా వార్తలు