kantara , rishab shetty : భార్యను సినిమాలో నటించమని పట్టుబట్టిన కాంతార హీరో?

కన్నడ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వంలో నటించిన చిత్రం కాంతార.ఈ సినిమా సెప్టెంబర్ 30వ తేదీ విడుదల అయ్యి ఎలాంటి ప్రభంజనాలను సృష్టిస్తుందో మనకు తెలిసిందే.

 Kantara Hero Insisted His Wife To Act In The Film Kantara Hero , Rishab Shetty,-TeluguStop.com

ఇలా అన్ని భాషలలో ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని భారీ కలెక్షన్లను రాబట్టింది.ఈ క్రమంలోనే ఈ సినిమా పేరు ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో మార్మోగిపోతుంది.

ఇకపోతే హీరో రిషబ్ శెట్టి సతీమణి ప్రగతి శెట్టి కూడా ఈ సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే తన పాత్ర గురించి తాజాగా ప్రగతి శెట్టి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సినిమాలో ప్రగతి శెట్టి ఇద్దరు పిల్లలతో కలిసి ఓపెనింగ్ సీన్ లో కనిపించి సందడి చేశారు.ఇలా ఈ సినిమాలో ఈమె తొలి సన్నివేశంలోనే ఒక రాణి పాత్రలో నటించారు.

ఈమె తన భర్త షూటింగ్లో ఉండగా పిల్లలతో కలిసి షూటింగ్ లోకేషన్ కి వెళ్ళారట.ఈ క్రమంలోనే ఒక రాణి పాత్ర వారికి ఇద్దరు పిల్లలతో కలిసి నటించే సన్నివేశం రావడంతో రిషబ్ శెట్టి ఆ పాత్రలో తన భార్య నటించాలని ఆమెను బలవంతం చేశారట.

Telugu Kantara, Pragati Shetty, Rishab Shetty-Movie

ఇలా ఈ పాత్రలో నటించే అవకాశం తన భార్యకు ఇచ్చినప్పటికీ ఆమె మాత్రం తనకు బదులు వేరే ఎవరినైనా తీసుకోవాలని సూచించిన రిషబ్ శెట్టి మాత్రం పట్టువదలకుండా తన భార్య చేత ఆ పాత్రలో నటింప చేశారంటూ ఈ సందర్భంగా ప్రగతి శెట్టి కాంతార సినిమాలో తన పాత్ర గురించి వెల్లడించారు.ఇక ఈ సినిమా అన్ని భాషలలో మంచి విజయం సాధించడంతో ఒక రాణిగా తన పాత్ర కూడా హైలెట్ అయిందని ప్రగతి శెట్టి పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube