ఇంగ్లాండ్ కెప్టెన్ సరికొత్త రికార్డు.. టెస్టుల్లో అత్యధిక సిక్సులు..!

టెస్టుల్లో అత్యధిక సిక్సులు కొట్టి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ .

న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్ట్ లో రెండో ఇన్నింగ్స్ లో స్టోక్స్ తన మొదటి సిక్స్ తో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు.

అయితే ఇంతకు ముందు 107 సిక్సులు కొట్టిన రికార్డ్ ఇంగ్లాండ్ హెడ్ కోచ్ మెకల్లమ్ పేరు పై ఉండేది.ఇక తాజాగా మెకల్లమ్ రికార్డును బ్రేక్ చేసి టెస్టుల్లో 109 సిక్సులు కొట్టిన ఆటగాడిగా ప్రపంచ రికార్డ్ సృష్టించాడు.

రికార్డును బ్రేక్ చేసిన స్టోక్స్ ను మెకల్లమ్ అభినందించాడు.

ఇక తర్వాత స్థానాలలో ఆడం గీల్ క్రిస్ట్ (100), క్రిస్ గేల్ (98), జాక్వేస్ కల్లిస్ (97) వరుస స్థానాలలో ఉన్నారు.ఇక 12 మ్యాచ్లలో కేవలం రెండే మ్యాచ్లు గెలిచిన ఇంగ్లాండ్ జట్టు, బెన్ స్టోక్స్ కెప్టెన్ అయ్యాక ఎన్నో విజయాలను అందుకుంది.కాగా ప్రస్తుతం న్యూజిలాండ్ తో ఆడుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 19 పరుగులు, రెండవ ఇన్నింగ్స్ లో 31 పరుగులు చేశాడు స్టోక్స్.

Advertisement

ఇక ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ ను వన్డే తరహాలో ఆడుతూ న్యూజిలాండ్ కు చెమటలు పట్టిస్తుంది.రెండో ఇన్నింగ్స్ లో 72 ఓవర్లగాను 9 వికెట్లు నష్టానికి 365 పరుగులు చేసింది.

మొదటి ఇన్నింగ్స్ తో కలుపుకొని మొత్తం 384 పరుగులు చేసి భారీ లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందు పెట్టింది.

ఇక బరిలోకి దిగిన న్యూజిలాండ్ కేవలం 14 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది.డివాన్ కాన్వే రెండు పరుగులు చేసి స్టువర్ట్ బ్రాండ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు.కేన్ విలియంసన్, బ్రాడ్ బౌలింగ్లో డక్ ఔట్ కావడంతో లక్ష్యానికి 380 పరుగుల దూరంలో న్యూజిలాండ్ ఉంది.

డ్రై ఫ్రూట్స్ తినటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
Advertisement

తాజా వార్తలు