ఏలూరు లో వింత వ్యాధికి నీళ్ళు కారణం కాదు

ఏలూరులో అంతు చిక్కని వ్యాధికి నీళ్ళు కారణం కాదని ఆర్గాన్ క్లోరైడ్ ప్రభావం వలన జనాలు అనారోగ్యానికి గురైనరని కమిటీ బలంగా అభిప్రాయ పడింది.

డిసెంబర్ 4 వ తేదీన నుండి 12వ తేదీ మధ్యలో 622 మంది అంతుచిక్కని రోగంతో ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే.

ఈ విషయం అప్పుడు సంచలనం సృష్టించింది.దానికి కారణం ఏమిటి అనే విషయం తెలుసుకోవడానికి బాధితుల నుండి రక్తం, వెన్ను ద్రవం, మూత్రం , మలం, వాంతి, నమూనాలను సేకరించింది.

అందుకు జాతీయ, రాష్ట్ర సంస్థలు ఓ కమిటీని నియమించాయి.ఆ కమిటీ సభ్యులు బాధితుల నివాస ప్రాంతాలు వారి ఆహారపు అలవాట్లు, వారి అభిప్రాయాలను సేకరించి ఓ నివేధికను తయారు చేసింది.

ఏలూరు మార్కెట్ కు వచ్చిన కూరగాయలు, అక్కడి నుండి వివిద ప్రాంతాలకు తరలి వెళ్ళుతాయి.వాటిని కొన్న బాధిలు పలు చోట్ల అనారోగ్యానికి గురైనారని స్పష్టం చేసింది.

Advertisement

ఆర్గాన్ క్లోరైడ్ కూరగాయలు, పండ్ల ద్వారా బాధితుల శరీరంలోకి వెళ్ళి అనారోగ్యం బారిన పడ్డారని స్పష్టం చేసింది.బాధిలు అనారోగ్యానికి ముందు రెండు మూడు రోజులుగా మాంసం తీసుకోలేదు.

కనుక కూరగాయల ద్వారానే వచ్చిందని పేర్కొన్నారు.నీళ్లలో ఆర్గాన్ క్లోరైడ్ తక్కువగా ఉంటుంది.

నీళ్ల ద్వారా రాలేదని కమిటీ స్పష్టం చేసింది.

ఈ రాగి డ్రింక్ తో నీరసానికి చెప్పండి బై బై..!
Advertisement

తాజా వార్తలు