దారుణం: కరెంట్ షాక్‌తో ఏనుగు మృతి..!

ఇటీవల కాలంలో మూగజీవాల మరణాల సంఖ్య ఎక్కువ అయిపోయింది.తెలిసో తెలియకో మనుషుల కారణంగానే ఎక్కువ మరణాలు జరుగుతున్నాయి.

కొద్దీ రోజుల క్రితం కేరళలో పేలుగు పదార్థాలతో కూడిన ఆహారం తిని గర్భిణీ ఏనుగు మృతి చెందిన సంగతి తెలిసిందే.ఆ ఘటన సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇంకా ఆ ఘటన మరవక ముందే ఇప్పుడు మరో ఛత్తీస్‌గఢ్‌‌లో మరో రెండు ఏనుగులు మృతిచెందాయి.అంతకు ముందు మూడు ఆడ ఏనుగులు మృతిచెందాయి.

వారం వ్యవధిలోనే ఇన్ని ఏనుగులు అనుమానాస్పద రీతిలో మృతిచెందాయి.అయితే రెండు వారాల కిందట పశ్చిమ్ బెంగాల్‌లో మూడు ఏనుగులు విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయాయి.

Advertisement

తాజాగా ఇప్పుడు మరో ఏనుగు కరెంటు షాక్ తో మృత్యువాత పడింది.జల్పాయ్ గురి పరిధిలోని బామన్ దంగా టీ ఎస్టేట్ సమీపంలో 25 ఏళ్ల వయసుగల ఏనుగు చనిపోయినట్టు అటవీ అధికారులు తెలిపారు.

ఏనుగు కళేబరాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం తరలించారు.కాగా వరుసగా ఏనుగులు ఇలా మృత్యువాత పడటంతో అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు