వాయిదాల్లో విద్యుత్ బిల్లు కట్టొచ్చు ...! కాకపోతే...?

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో.రాష్టంలోని SPDCL సీఎండీ జి.

రఘుమారెడ్డి కరెంటు బిల్లులను వాయిదాలలో చెల్లించే అవకాశం ఇస్తున్నట్లు తెలియజేశారు.ఇకపోతే అందుకు గాను 1.5% ఆలస్య రుసుముతో కచ్చితంగా చెల్లించాల్సిందే అని తెలియజేశారు.రాష్ట్ర వ్యాప్తంగా SPDCL పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 95 లక్షలకు మంది వినియోగదారులు ఉండగా అందులో ఏకంగా 70 లక్షల గృహ వినియోగదారులు ఉన్నారని.

అందులో కూడా చాలా వరకు 200 యూనిట్లలోపు వాడేవారు మాత్రమే అని తెలియజేశారు.ఇకపోతే ప్రస్తుత లాక్ డౌన్ వల్ల దాదాపు 40 శాతం మంది వినియోగదారులు కరెంట్ బిల్లులు చెల్లించలేదని ఆయన తెలిపారు.

ప్రతి నెలకు సంబంధించి రెండవ తేదీ నుండి 14వ తేదీ లోపు కరెంటు బిల్లులు అందిస్తున్నామని, ఇకపోతే ఏప్రిల్ నెలలో మాత్రం లాక్ డౌన్ కఠినంగా ఉండటంతో ఆ నెలలో బిల్లులు జారీ చేయలేదని తెలియజేశారు.ఇకపోతే తాజాగా మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి మాత్రమే ఏక కాలంలోనే బిల్లులు జారీ చేస్తున్నామని, అంతేకాకుండా.

Advertisement

ఈ మూడు నెలల కరెంట్ బిల్లును కూడా ఒకేసారి లెక్కించకుండా ప్రతినెల విడదీసి నెలల వారిగా లెక్కించామని ఆయన తెలియజేశారు.ఇకపోతే గృహ విద్యుత్ వినియోగంలో వాడకం ఆధారంగా మూడు కేటగిరీలను 9 శ్లాబులు గా నిర్ధారించినట్లు రఘురామిరెడ్డి తెలియజేశారు.

అంతే కాకుండా ఆయన వివిధ రకాల బిల్లులను స్వయంగా చూపించి ఏ విధంగా లెక్క వేసారో కూడా చూపించారు.

Advertisement

తాజా వార్తలు