ఖమ్మం జిల్లా ప్రజల కోసం ఎన్నికల్లో పోటీ..: తుమ్మల

ఖమ్మం జిల్లా సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

భారీ ర్యాలీ ముగిసిన అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

కార్యకర్తల దయతోనే జిల్లా కోసం 40 ఏళ్లు పని చేశానని చెప్పారు.ఈ క్రమంలో ఖమ్మం జిల్లా ప్రజల కోసం వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు.

మీ పాదాలు కడిగి మీతోటి శభాష్ అనిపించుకుంటానని చెప్పారు.జిల్లా ప్రజల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలని కృషి చేశానని పేర్కొన్నారు.

జిల్లా ప్రజల రుణం తీర్చుకోలేనన్న తుమ్మల రాజకీయ పదవి తన కోసం కాదని, తన జిల్లా కోసమని స్పష్టం చేశారు.తనపై కొన్ని పరాన్న జీవులు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు.

Advertisement

అయితే ఎక్కడా తలవంచేది లేదన్న తుమ్మల తల నరుక్కుంటా కానీ తన వలన మాత్రం ఎవరూ తలదించుకోవద్దని వెల్లడించారు.

ఆ ఆరోగ్య సమస్యతో బాధ పడుతున్న హీరోయిన్ శృతి హాసన్.. బాధను భరిస్తున్నానంటూ?
Advertisement

తాజా వార్తలు