వేడి వేడి టీ తాగుతున్నారా.. రిస్క్‌లో ప‌డ‌తారు జాగ్ర‌త్త‌!

ఉద‌యం లేవ‌గానే చాలా మంది వేడి వేడి టీ తాగేస్తుంటారు.ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ అల‌వాటు కొన్ని కోట్ల మందికి ఉంది.

అలా తాగ‌డం వ‌ల్ల మైండ్ రీఫ్రెష్‌గా ఉంటుంద‌ని చెబుతుంటారు.ఒక‌వేళ ఉద‌యం వేడి వేడి టీ క‌డుపులో ప‌డ‌క‌పోతే.

Effects Of Drinking Hot Tea! Drinking Hot Tea, Hot Tea, Tea, Latest News, Health

రోజంతా ఏదో వెలితిగా ఉంటుంద‌ని చెప్పే వారు ఉన్నారు.ఇక కొంద‌రైతే ఉద‌య‌మే కాదు మ‌ధ్యాహ్నం, సాయంత్రం, త‌ల‌నొప్పిగా ఉన్న‌ప్పుడు ఇలా ర‌క‌ర‌కాల స‌మ‌యాల్లో వేడి వేడి టీ తాగుతుంటారు.

అయితే మితంగా టీని తీసుకుంటే మంచిదే.కానీ, వేడి వేడిగా పొగ‌లు క‌క్కే టీని తీసుకుంటేనే రిస్క్‌లో ప‌డ‌తారు.

Advertisement

అవును, 70 డిగ్రీల సెల్సియస్‌కు మించి వేడిగా ఉన్న టీ ని తీసుకోవ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంద‌ని ఆరోగ్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.వేడి వేడి టీ సేవించ‌డం వ‌ల్ల అన్నవాహిక క్యాన్సర్ వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

మ‌నం తిన్న ఆహారాన్ని గొంతు నుంచి పొట్ట దాకా చేర్చే గొట్టం వంటి భాగాన్ని అన్నవాహిక(ఈసోఫేగస్‌) అంటారు.అయితే ప్ర‌తి రోజు వేడి వేడి టీ తీసుకున్న‌ప్పుడు ఈ అన్న‌వాహిక మంట పెట్ట‌డంతో పాటుగా పుండ్లకు దారితీస్తుంది.

అవి ఎక్కువైతే క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ‌గా ఉంటుంది.అలాగే ఉద‌యాన్నే ఖాళీ క‌డుపుతో వేడి వేడి టీ తాగ‌డం వ‌ల్ల అల్స‌ర్‌, గ్యాస్ వంటి స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తోంది.

అందుకే టీని మ‌రీ వేడిగా కాకుండా కాస్త గోరు వెచ్చ‌గా ఉన్న‌ప్పుడు తీసుకుంటే మంచిది.ఇలా గోరు వెచ్చ‌ని టీ ని తీసుకుంటే ఆరోగ్యానికి కూడా బోలెడ‌న్ని ప్ర‌యోజ‌నాలు చేకూర‌తాయి.

దారుణం.. మురికి కాలువ నీటితో కూరగాయలు కడుగుతున్న వ్యాపారి... వీడియో చూస్తే గుండెలు గుభేల్!
కూలీ కోసం బుట్ట బొమ్మ... కళ్ళు చెదిరే రేంజిలో రెమ్యూనరేషన్?

త‌ల‌నొప్పి, ఒత్త‌డిగా ఉన్న స‌మ‌యంలో ఒక క‌ప్పుడు టీ తాగితే.మంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

Advertisement

అలాగే టీ ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని బ‌ల‌ప‌రిచి.రోగ‌ల‌ను ద‌రిచేర‌కుండా కాపాడుతుంది.

అలాగే రెగ్యుల‌ర్ ఒక‌టి లేదా రెండు క‌ప్పుల టీని తీసుకోవ‌డం వ‌ల్ల మానిషి జీవిత కాలం కూడా పెరుగుతుంద‌ట‌.అందుకే టీని తీసుకోండి.

కాక‌పోతే గోరు వెచ్చ‌గా ఉన్న‌ప్పుడు సేవించాలి.

తాజా వార్తలు