రాశిని బట్టి ఆహారం ఆశ్చర్యంగా ఉందా అయితే ఇది మీ కోసమే... చూడండి

రాశిని బట్టి మన భవిష్యత్ మరియు మనస్తత్వాలు తెలుసుకుంటున్నాం.అయితే జ్యోతిష్య శాస్త్రం ఏ రాశి వారు ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదో తెలుసుకుందాం.

ఏ ఆహారం తింటే జాతకచక్రం ప్రభావితం అవుతుందో తెలుసుకుందాం.మేష రాశి ఈ రాశి వారికి ఆకలి ఎక్కువగా ఉంటుంది.

వీరు క్యాలరీలు ఎక్కువగా ఉన్న ఆహారం మీద ఎక్కువ మక్కువ చూపుతారు.కానీ వీరు ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

ముఖ్యమైన విషయం ఏమిటంటే వీరు అసలు మద్యం జోలికి వెళ్ళకూడదు.వృషభ రాశి ఈ రాశి వారు మంచి భోజన ప్రియులు.

Advertisement

ఈ రాశి వారు పండ్లను ఎక్కువగా తీసుకోవాలి.బ్రెడ్ మరియు స్వీట్స్ జోలికి అసలు వెళ్ళకూడదు.

మిధున రాశి ఈ రాశి వారు జంక్ ఫుడ్స్ తినకూడదు.భోజనం చేయటానికి సమయ పాలన తప్పనిసరిగా పాటించాలి.

ఏ ఆహారం అయినా తీసుకోవచ్చు.కర్కాటక రాశి ఈ రాశి వారికి ఇంటి భోజనం అంటే ప్రీతి.

ఈ ఆహారం తీసుకున్న లిమిట్ గా తీసుకోవాలి.వీరు స్పైసి ఆహారాలను తినాలి.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి14, మంగళవారం2025

వీరు అతిగా తింటే కొంచెం ఇబ్బంది పడతారు.సింహ రాశి ఈ రాశి వారు ఖరీదైన భోజనము ఇష్టపడతారు.

Advertisement

అలాగే విందులకు వెళ్లాలని ఉబలాటపడతారు.వీరు కుటుంబంతో కలిసి భోజనం చేయాలనీ అనుకుంటారు.

ఈ రాశి వారు పండ్లు,కూరగాయలు ఎక్కువగా తీసుకుంటే మంచిది.కన్యా రాశి ఈ రాశి వారికీ కొంచెం జీర్ణ శక్తి తక్కువగా ఉంటుంది.

అందువల్ల తక్కువ ఆహారాన్ని ఎక్కువ సార్లు తింటే మంచిది.నిల్వ ఉంచిన ఆహారాలను ఎట్టి పరిస్థితిలోను తీసుకోకూడదు.

పచ్చి కూరలను తింటే మంచిది.తుల రాశి వీరు మంచి భోజన ప్రియులు.

వీరు ఎక్కువగా భోజనం చేసే సమయంలో మద్యం తీసుకుంటారు.వీరు చాకొలేట్లు, స్వీట్లు ఎక్కువగా తీసుకుంటారు.

వీటిని మానేయటం చాలా ముఖ్యం.వృశ్చిక రాశి ఈ రాశి వారు ఆహార నియమాలను పాటించి ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవటానికి ఇష్టపడతారు.

మంచి నీరు మరియు టీ ఎక్కువగా తీసుకోవచ్చు.కానీ మధ్యం జోలికి మాత్రం వెళ్ళకూడదు.

ధనుస్సు రాశి ఈ రాశి వారు స్పైసీ ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టం.ఈ ఆహారం తినటం వలన జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి.

వీరు ఏ ఆహారం అయినా తీసుకోవచ్చు.అయితే మోతాదు మించకుండా చూసుకోవాలి.

మకర రాశి ఈ రాశి వారు ప్రశాంతమైన వాతావరణంలో భోజనం చేయాలనీ కోరుకున్నారు.ఇంటి వంటే వీరికి ఇష్టం.

వీరికి స్పైసీ ఫుడ్ అంటే ఇష్టం ఉండదు.ఉప్పు వీరి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

కుంభ రాశి ఈ రాశి వారు భోజనం అందరితో కలిసి తినాలని మరియు పంచుకోవాలని ఆశిస్తారు.తాజా పండ్లు, కూరగాయలు, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే చాలా మంచిది.

మీన రాశి ఈ రాశి వారు మంచి భోజన ప్రియులు.మద్యం సేవిస్తూ ఆహారం తీసుకోవడం వీరికి చాలా ఇష్టం.

వీరు మంచి నీటిని ఎక్కువగా తీసుకోవాలి.

తాజా వార్తలు