ఇండోనేషియాలోని ఈ ప్రాంతంలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక..

ఇండోనేషియాలోని మలుకు ప్రావిన్స్ లో మంగళవారం రిక్టర్ స్కేలు పై 7.5 తీవ్రత తో భారీ భూకంపం సంభవించడంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

12.47 నిమిషములకు భూకంపం సంభవించినట్లు సమాచారం.భూకంప కేంద్రం మలుకు టంగారా బరత్ జిల్లాకు వాయువ్యంగా 148 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భం కింద 131 కిలోమీటర్ల లోతున కేంద్రీకృతమై ఉందని అధికారులు వెల్లడించారు.

సమీపంలోనీ చాలా ప్రావిన్స్ లో కూడా ప్రకంపనలు సంభవించాయి.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రధాన భూకంపం తర్వాత బలహీన స్థాయి నుంచి మద్యస్థ స్థాయి వరకు మూడు ప్రకంపనాలు సంభవించాయని చెబుతున్నారు.

ముందస్తు జాగ్రత్త చర్యగా దాదాపు 200 మంది మలుకు ప్రజలు సునామీ భయంతో ఎత్తైన ప్రాంతాలకు మారారని ఈ విపత్తు నిర్వహణ అధికారులు వెల్లడించారు.

మలుకు సమీపంలో ఆగ్నేయ స్థులవేసి ప్రావిన్స్ కు సునామీ హెచ్చరికను జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.అంతే కాకుండా భూకంపం కారణంగా చాలా ఇల్లు, భవనాలు ధ్వంసమైనట్లు అధికారులు వెల్లడించారు.ఇంకా చెప్పాలంటే వాటిలో కొన్ని పగుళ్లు ఉండగా మరికొన్ని కూలిపోయాయని విపత్తు నిర్వహణ అధికారులు వెల్లడించారు.

Advertisement

ప్రకంపనల ప్రభావం తెలుసుకోవడానికి ఖచ్చితమైన ఒక అంచనా నిర్వహించబడుతుందని అధికారులు తెలిపారు.

ఇప్పటి వరకు ఏ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కూడా ఎటువంటి గాయాలు లేదా మరణాలు సంభవించినట్లు ప్రాథమిక నివేదికలు లేవు.మేము సునామీని ఊహించి అనేక సార్లు ప్రజలకు మక్ డ్రిల్ నిర్వహించాము.కాబట్టి భూకంపం సంబంధించినప్పుడు స్థానిక ప్రజలు తీర ప్రాంతాలను విడిచిపెట్టి దూరంగా ఎత్తైన మైదానాలకు చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు