టికెట్ల చిచ్చు పెట్టిన మైనంపల్లి..ఉదయపూర్ తీర్మానం ఉట్టిదేనా..?

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణలో కాంగ్రెస్ పూర్తిగా డల్ అయిపోయింది.

కాంగ్రెస్ కు తెలంగాణలో నూకలు చెల్లవు అనే సమయంలో రేవంత్ రెడ్డి ( Revanth reddy ) పార్టీలో చేరి టిపిసిసి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.

దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త జోష్ వచ్చింది.అంతేకాకుండా ఇదే సమయంలో రాహుల్ గాంధీ ( Rahul gandhi ) కూడా తన కొత్త రాజకీయ స్టేటజీ ఉపయోగిస్తూ ముందుకు వెళ్తున్నారు.

ఇక కాంగ్రెస్ గల్లి నుంచి ఢిల్లీ వరకు ఓటమికి కారణాలేంటనేది తెలుసుకొని అగ్రనాయకత్వమంతా ఎన్నో వ్యూహరచనలు చేశారు.ఈ వ్యూహాలకు అనుగుణంగా కర్ణాటక ఎన్నికలు మంచి ఫలితాన్ని ఇచ్చాయి.

దీంతో ఇదే వ్యూహాన్ని తెలంగాణ కాంగ్రెస్ లో కూడా అమలు చేయాలని కాంగ్రెస్ భావించి ఆ విధంగానే వస్తోంది.

Advertisement

ఉదయపూర్ తీర్మానం ఏ నేతలకైనా వర్తిస్తుందని, ఆ తీర్మానాన్ని క్రాస్ చేయరాదని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.ఉదయపూర్ ( Udaipur ) తీర్మానం ప్రకారం ఒకే ఇంట్లో, ఇద్దరికి టికెట్లు ఇవ్వకూడదు, అంతేకాకుండా టికెట్ కావాలంటే కాంగ్రెస్ పార్టీలో ఐదు సంవత్సరాల నుంచి పని చేసి ఉండాలి.ఇలా కొన్ని నియమ నిబంధనలు పెట్టింది.

అయితే ఈ నియమ నిబంధన ప్రకారమే కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ టికెట్ల కేటాయింపు కొనసాగిస్తోంది.ఇదే తరుణంలో బీఆర్ఎస్ కీలక నేత ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ( Mynampally Hanumanth Rao ) కాంగ్రెస్ లో చేరారు.

దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు రెండు టికెట్లు కేటాయించింది.ఇక్కడే మొదలైంది అసలు రచ్చ.

రూల్స్ ప్రకారం వెళ్తున్న పార్టీలో మైనంపల్లికి రెండు టికెట్లు ఎలా ఇస్తారని సీనియర్లంతా ప్రశ్నిస్తున్నారు.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!

మైనంపల్లిని అడ్డుపెట్టుకొని ఉత్తంకుమార్ రెడ్డి ( Uttam Kumar Reddy ) కూడా తన భార్య పద్మావతిరెడ్డికి, జానారెడ్డి తన ఇద్దరు కుమారులు జైవీర్ రెడ్డి, రఘువీరా రెడ్డికి, అలాగే మల్లు రవి తన కొడుకుకు, కొండ మురళి తనతో పాటు తన భార్య సురేఖకు, కూతురు సుస్మితకు, ఇక పీజేఆర్ కుటుంబం నుంచి విష్ణు, విజయకు, ఇక సీతక్క ( Seethakka ) తో పాటు తన కొడుకు సూర్యకు టికెట్టు అడుగుతున్నారు.వీరంతా మైనంపల్లికి ఏ విధంగా రెండు టికెట్లు ఇస్తారు, మాకెందుకు ఇవ్వరని ప్రశ్నిస్తున్నారు.మైనంపల్లి పార్టీలోకి వచ్చి టికెట్ల విషయంలో గొడవ పెట్టారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు