ధాన్యం కొనుగోలుపై దుబ్బాక ప్రత్యేక సమావేశం...!

నల్లగొండ జిల్లా: రైతులు నేడు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ధాన్యం కొనుగోలు సమస్య అని, వరి కోతలు ప్రారంభమై సుమారు 15 రోజులు అవుతున్నా ప్రభుత్వం ఐకెపి కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టలేదని,రైతు సమస్యపై ఐక్య కార్యాచరణ తీసుకొని ముందుకు పోదామని కాంగ్రెస్ నల్లగొండ నియోజకవర్గ నేత దుబ్బాక నరసింహారెడ్డి పిలుపునిచ్చారు.

ఇందులో భాగంగా ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో "రా తరలిరా అన్నం పెట్టే రైతుకు అండగా నిలుద్దాం" అనే నినాదంతోవామపక్ష నేతలతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించుకున్న పంటకు సరైన ధర లేక నేడు దళారుల చేతుల్లో పడి అన్నదాత మోసపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.రైతుల పక్షాన నిలిచి రైతుల గళం వినిపించడానికి వారి యొక్క సమస్యలపై గత వారం రోజుల క్రితం కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని,అయినా ప్రభుత్వం తరఫున ఎటువంటి సమాధానం లేకుండా రైతులను పూర్తిగా విస్మరించే స్థితిలో నేటి ప్రభుత్వం విధివిధానాలు నడుస్తున్నాయని ఆరోపించారు.

రైతుల పట్ల ఈ మొండి వైఖరిని అహంకారపూరితమైన ధోరణిని నిరసిస్తూ వామపక్ష పార్టీల కలుపుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదురుగా రైతు మహాధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.రైతులు అధిక సంఖ్యలో పాల్గొని తమ యొక్క ప్రధానమైన సమస్యలను ఈ అహంకారపూరితమైన ప్రభుత్వానికి వినబడే విధంగా నినదిద్దాం, అందరం కదులుదాం రైతుల పక్షాన నిలుద్దామని పిలుపునిచ్చారు.

ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!
Advertisement

Latest Press Releases News