ఆర్ఎంపిలు మెరుగైన వైద్యసేవలు అందించాలి: వైద్యాధికారి

సూర్యాపేట జిల్లా:తెలంగాణ ఆర్ఎంపి వైద్యుల సంక్షేమ సంఘం, సూర్యాపేట జిల్లా 11 వ మహాసభ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పుప్పాల లక్ష్మినర్సయ్య అధ్యక్షతన పట్టణంలోని ఐఎంఎ ఫంక్షన్ హాల్ నందు అదివారం నిర్వహించారు.ఈ సమావేశంలో గుండెపోటు వచ్చిన సమయంలో చేయవలసిన సిపిఆర్ పై అవగాహన కల్పించారు.

 Rmps Should Provide Better Medical Services Medical Officer,rmps , Medical Servi-TeluguStop.com

ఈసందర్భంగా కేసారం నందు సంఘ భవన నిర్మాణానికి సహాయ సహకారాలు అందించిన విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డికి ధన్యవాదములు తెలిపారు.సమావేశంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటా చలం మాట్లాడుతూ ఆర్ఎంపి వైద్యులందరికి మండలాలలో, గ్రామాలలో సిపిఆర్ పై అవగాహన కల్పిస్తామని చెప్పారు.

గుండె నొప్పి వఛ్చిన వ్యక్తి చాతి మీద గట్టిగా అదుముతూ, నోటిలోకి గాలిని పంపింగ్ చేయాలని చేసి చూపించారు.

గ్రామాల్లో ఆపదలో ఉన్న ప్రజలకు గ్రామీణ వైద్యులు ప్రథమ చికిత్స చేసి ఎంతోమంది పేదల ప్రాణాలు కాపాడుతున్నారని,వారి సేవలను కొనియాడారు.

కార్యక్రమంలో ఆర్ఎంపి వైద్యుల రాష్ట్ర అధ్యక్షుడు వెంకన్న ‌‌మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జివో నంబర్ 428 ని అమలుపరచి గ్రామీణ వైద్యులకు కమ్యూనిటీ పారా మెడికల్ శిక్షణ ఇచ్చి,గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఆర్ఎంపిలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు,పసునూరి సత్యనారాయణ,యండి గఫార్,జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి రాజేందర్,రహమతుల్లా, చిలువేరు చంద్రయ్య, బెల్లంకొండ డాంగె గౌడ్, ఎల్లె వెంకటేశ్వర్లు, జెర్రిపోతుల లక్ష్మణ్ గౌడ్, గూకంటి రాజబాబు రెడ్డి, ఎస్.కృష్ణ,రవింద్ర చారి, బండారు వీరన్న,కుమ్మరి వెంకన్న,ఎస్ కె.నాగుల్ మీరా,రేసు ఉపేందర్, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube