స‌మ్మ‌ర్ వ‌చ్చేస్తోంది.. మ‌జ్జిగ‌ను ఇలా తాగితే సూప‌ర్ కూల్ అయిపోతారు!

స‌మ్మ‌ర్ సీజ‌న్ వ‌చ్చేస్తోంది.ఎండ‌లు మెల్ల మెల్ల‌గా పెరుగుతున్నాయి.

వేస‌వి వేడిని త‌ట్టుకోవ‌డం ఎంత‌ క‌ష్టంతో కూడుకున్న ప‌నో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

పిల్ల‌లైనా, పెద్ద‌లైన మండే ఎండ‌ల‌ను భ‌రించ‌లేక నానా పాట్లు ప‌డుతుంటారు.

చెమ‌ట‌లు, ఉక్క‌పోతా, డీహైడ్రేష‌న్‌, వ‌డ దెబ్బ‌, గ్యాస్‌, ఎసిడిటీ, లోబీపీ, అతిసారం ఇలా ఎన్నో స‌మ‌స్యలు వేస‌వి కాలంలో ఇబ్బంది పెడుతుంటాయి.పైగా గుండె జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ సైతం పెరుగుతుంది.

అందుకే వీటి నుంచీ త‌ప్పించుకోవాలంటే కొన్ని కొన్ని ఆహారాలు త‌ప్ప‌ని స‌రిగా రెగ్య‌లర్ డైట్‌లో చేర్చుకోవాలి.అటువంటి వాటిల్లో బ‌ట‌ర్ మిల్క్‌(మ‌జ్జిగ‌) కూడా ఒక‌టి.

Advertisement

ఆరోగ్య ప‌రంగా మ‌జ్జిగ అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.ఎన్నో జ‌బ్బుల‌ను నివారిస్తుంది.

అందులోనూ ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా మ‌జ్జిగను తీసుకుంటే స‌మ్మ‌ర్‌లోనూ మీరు సూప‌ర్ కూల్ అయిపోవ‌డం ఖాయం.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం ప‌దండీ.

ముందు ఒక బ్లెండ‌ర్ తీసుకుని అందులో గుప్పెడు పుదీనా ఆకులు, పావు స్పూన్ గ్రీన్ చిల్లీ ముక్క‌లు, అర స్పూన్ న‌ల్ల ఉప్పు, పావు స్పూన్ దాల్చిన చెక్క పొడి, కొద్దిగా వాట‌ర్ పోసి మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మంలో ఒక క‌ప్పు పెరుగు, రెండు గ్లాసుల వాట‌ర్, వ‌న్ స్పూన్ నిమ్మ ర‌సం వేసి హ్యాండ్ బ్లెండర్ సాయంతో బాగా మిక్స్ చేస్తే మ‌జ్జిగ రెడీ.

ఇలా త‌యారు చేసుకున్న మ‌జ్జిగ‌ను రోజుకు ఒక గ్లాస్ చ‌ప్పున తీసుకుంటే మండే ఎండ‌ల్లోనూ శ‌రీరం కూల్‌గా ఉంటుంది.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?

డీహైడ్రేష‌న్ స‌మ‌స్య బారిన ప‌డకుండా ఉంటారు.ర‌క్త పోటు స్థాయిలు అదుపు త‌ప్ప‌కుండా ఉంటాయి.గ్యాస్‌, ఎసిడిటీ, క‌డుపు నొప్పి వంటి జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.

Advertisement

తల‌నొప్పికి దూరంగా ఉండొచ్చు.మ‌రియు గుండె జ‌బ్బులు వ‌చ్చే ప్ర‌మాదం కూడా త‌గ్గు ముఖం ప‌డుతుంది.

తాజా వార్తలు