ప్రథమ చికిత్స రంగంలో విశేష కృషి చేసిన ఇండియన్‌కి అరుదైన గౌరవం..!

తాజాగా డాక్టర్ షబాబ్ ఆలమ్‌ను శ్రీలంకలో జరిగిన ఒక కాలేజీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించి డాక్టరేట్ పట్టా ప్రదానం చేశారు.షబాబ్ ఫస్ట్ ఎయిడ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అధిపతి.

 Dr Shabab Alam Awarded For His Contribution In The Field Of First Aid Details,-TeluguStop.com

ప్రథమ చికిత్సలో విశేషమైన కృషి చేసినందుకు గాను డాక్టర్‌ ఆలమ్‌ను సత్కరించి కాలేజీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.ప్రథమ చికిత్స కోర్సులను బోధించడానికి శ్రీలంక ఫస్ట్ ఎయిడ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్యం కలిగి ఉంది.

డా.ఆలమ్‌ విద్యారంగంలో, అతని నగరం నుంచి అతని సేవలకు అభినందనలు అందుకుంటున్నారు.

Telugu Doctors, Drshabab, Dr Shabab Alam, Aid, Hospitals, Nri, Sri Lanka-Telugu

భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో శిక్షణ పొందిన వైద్య నిపుణుల కొరతను పరిష్కరించడానికి ప్రథమ చికిత్స మండలి కృషి చేస్తోంది.చాలా మారు మూల ప్రాంతాల్లో ఆసుపత్రులు అందుబాటులో లేవు, అలాగే ఇవి గ్రామీణ ప్రాంతాలకు దూరంగా ఉన్నందున ప్రథమ చికిత్స ముఖ్యం.ఆసుపత్రికి చేరేలోపు ప్రథమ చికిత్స అందించడం ద్వారా ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడవచ్చు.

Telugu Doctors, Drshabab, Dr Shabab Alam, Aid, Hospitals, Nri, Sri Lanka-Telugu

సకాలంలో ప్రథమ చికిత్స అందక ప్రతి సంవత్సరం చాలా మంది మరణిస్తున్నారు.ఉదాహరణకు, గుండెపోటుకు గురైన వారిలో 90% మంది ప్రథమ చికిత్స ద్వారా రక్షించబడతారు.ప్రథమ చికిత్స అందక ప్రతి సంవత్సరం పది లక్షల మందికి పైగా మరణిస్తున్నారని.

అధిక రక్తస్రావం కారణంగా రెండు మిలియన్ల మంది మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి.ఇలాంటి కీలకమైన రంగంలో డాక్టర్ షబాబ్ ఆలమ్‌ గొప్ప సేవలను అందించడం, ఆ సేవలకు విదేశాల్లో గౌరవం పొందడం చెప్పుకోదగిన విషయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube