తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీపై అనుమానాలు..!!

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

నిన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో తెలంగాణ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్ సమావేశమైన సంగతి తెలిసిందే.

ఈక్రమంలో తెలంగాణలో పోటీ చేయొద్దని కాసానికి చంద్రబాబు సూచించారని తెలుస్తోంది.ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణపై తాను దృష్టి పెట్టలేనని చంద్రబాబు చెప్పారని సమాచారం.

అనంతరం నారా లోకేశ్ తో చర్చించాలని చంద్రబాబు చెప్పారని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో మరికాసేపటిలో నారా లోకేశ్ తో కాసాని జ్ఞానేశ్వర్ సమావేశం కానున్నారు.

అయితే లోకేశ్ కూడా తెలంగాణలో టీడీపీ పోటీ వద్దంటే కాసాని పార్టీని వీడతారనే వార్తలు జోరుగా సాగుతున్నాయి.

Advertisement
ఈ హోమ్ మేడ్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ బ్రైట్ అవ్వడం ఖాయం!

తాజా వార్తలు