పవన్ కు భీమ'వరం' అవుతుందా ..?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాల్లో పోటీకి దిగుతూ రెండు కీలక ప్రాంతాలను కవర్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు.

అన్ని పార్టీలకు కీలకమైన గోదావరి జిల్లాల్లో ప్రభావం చూపించేలా భీమవరం నుంచి పోటీ చేస్తుండగా, ఉత్తరాంధ్ర ప్రాంతం కవర్ అయ్యేలా గాజువాక నుంచి పోటీ చేస్తున్నాడు.

ప్రస్తుతం జగన్ సొంత జిల్లా అయిన పశ్చిమగోదావరి లో భీమవరం ఉండడం, గతంలో ఇదే జిల్లాలోని పాలకొల్లు నుంచి పవన్ అన్నయ్య చిరంజీవి పోటీ చేసి ఓడిపోవడంతో భీమవరంలో పవన్ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు అందరూ ఆరా తీస్తున్నారు.ఇక్కడ మొన్నటివరకు టీడీపీ - వైసీపీ నువ్వా నేనా అన్న రేంజ్ లో తలపడ్డాయి కానీ ఇప్పుడు పవన్ ఎంట్రీతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది.

అసలు పవన్ ఇక్కడి నుంచి పోటీ చేస్తాడని ఎవరూ ఊహించలేదు.అయన ఇక్కడి నుంచి పోటీ చేయడానికి కూడా ఒక ప్రధాన కారణం కూడా ఉంది.

అదేంటంటే ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి చెందినవారే ఎక్కువమంది ఉన్నాడు.ఇక్కడ 70 వేల వరకు ఓట్లు ఉన్నాయి.దీంతో ఈ అంశం బాగా కలిసివస్తుంది అనే ఆలోచనతో పవన్‌ ఇక్కడి నుంచి పోటీకి దిగినట్టు కనిపిస్తోంది.2009లో నియోజకవర్గాల పునర్విజనకు ముందు ఈ నియోజకవర్గంలో రాజుల ఆధిపత్యం ఉండేది.అప్పటి వరకు ఆ సామాజికవర్గానికి చెందిన వారే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.

Advertisement

పునర్విభజన తర్వాత రాజులు బలంగా ఉన్న పాలకోడేరు మండలాన్ని ఉండిలో కలపడం, కాపులు ఎక్కువగా ఉన్న వీరవాసరం మండలాన్ని భీమవరంలో కలపడంతో ఈ నియోజకవర్గంలో కాపుల హవా ఎక్కువగా కనిపిస్తోంది.

ప్రస్తుతం భీమవరం నియోజకవర్గయం లో పోటీ చేస్తున్న అభ్యర్థులను పరిగణలోకి తీసుకుంటే మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు బలంగానే కనిపిస్తున్నారు.టీడీపీ నుంచి పోటీకి దిగుతున్న సిట్టింగ్ ఎమ్యెల్యే పులపర్తి రామాంజనేయులు, వైసీపీ నుంచి పోటీ చేస్తున్న గ్రంధి శ్రీనివాస్, జనసేన నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ముగ్గురూ బలమైన వారే.అందుకే ఈ మూడు పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది.

కాంగ్రెస్, టీడీపీలో వరుసగా 10 ఏళ్ల పాటు భీమవరం ఎమ్మెల్యేగా ఉన్న రామాంజనేయులుపై వ్యతిరేకత కూడా ఎక్కువగానే ఉంది.ఇదే సమయంలో ఇక్కడి రాజకీయాలను శాసించే క్షత్రియులు ఎటువైపు ఉంటారు అనే ప్రశ్న కూడా అందరిలోనూ తలెత్తుతోంది.

ఎందుకంటే వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ కు రాజులకు గతం నుంచి వైరం ఉండడంతో వారంతా గ్రంధిని వ్యతిరేకిస్తున్నారు.దీంతో వారు టీడీపీ, జనసేన అభ్యర్థుల్లో ఎవరో ఒకరికి మద్దతు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు