దెబ్బతగిలితే నొప్పి తగ్గడానికి ఐస్ తో రుద్దుతున్నారా..?అలా రుద్దడం మంచిదా...?కాదా..?తెలుసుకోండి..!

చాలా మంది దెబ్బ తగలగానే ముందుగా ఐస్ క్యూబ్ తీసుకుని రుద్దుతారు.అలా చేస్తే నొప్పి తగ్గిపోతుందని భావిస్తారు.

కానీ దెబ్బలు తగిలినప్పుడు ఐస్ వాడటం మంచిది కాదని అధ్యయనాలు చెబుతున్నాయి.అసలు ఐస్ అనేది నిజంగా ఎలా పనిచేస్తుంది ? ఐస్ వాడటం వల్ల దెబ్బ తగిలిన చోట మనకు నొప్పి తాత్కాలికంగా కొన్ని నిమిషాలపాటు తగ్గినట్లు అనిపిస్తుంది, సాధారణంగా గాయం నయమయ్యే ప్రక్రియలో జోక్యం చేసుకుంటుంది.ఆ ప్రాంతాన్ని కొద్దీ సేపు తిమ్మిరెక్కిస్తుంది.

అంతే కానీ దెబ్బను తగ్గించడంలో ఎటువంటి సహాయం చేయదు సరికదా.ఇంకా దెబ్బ తగ్గడానికి పట్టే సమయాన్ని పెంచుతుంది.

అదెలాగో తెలుసుకోండి దెబ్బ తగిలగానే మనకు మంట పుడుతుంది.అలా మంట రావడం అనేది, ఆ దెబ్బ నయమయ్యే భాగంలో మొదలయ్యే మొదటి ప్రక్రియ.

Advertisement

దెబ్బ తగిలిన చోట కణజాలాన్ని మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావాలంటే మంట అనేది ఖచ్చితంగా రావాలి.ఎప్పుడైతే దెబ్బ తగిలిన చోట మంట వస్తుందో అప్పుడు అక్కడ కణజాలాన్ని మేల్కొల్పడంలో మంట ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది కానీ మనం ఎప్పుడైతే ఐస్ ని వాడతామో అప్పుడు అది మంటను రాకుండా అడ్డుకుంటుంది.

నిద్రావస్థలో ఉన్న కణాలు కూడా దెబ్బను నయం చేయడానికి పని మొదలు పెడతాయి.సాధారణంగా జరిగిపోయే ఈ నయమయ్యే ప్రక్రియకు ఐస్ వాడకం అనేది పెద్ద అవరోధం గా నిలుస్తుంది.

ఎప్పుడు అయితే మనకు దెబ్బ తగులుతుందో అప్పుడు ఆ ప్రదేశంలో రక్త నాళాలను పెద్దవిగా చేస్తుంది మన శరీరం.అందువల్లనే ఆ ప్రదేశం లో వాపు వస్తుంది.

ఆ సమయంలో ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ అధికమవుతుంది.రక్త ప్రసరణ ఎక్కువైనప్పుడు కొన్ని ప్రొటీన్ల తో పాటు, కొన్ని రసాయనాలు దెబ్బ తగిలిన ప్రాంతానికి చేరుకుంటాయి.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
అమెరికన్ వర్సిటీలలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు .. అన్నింటికీ బైడెనే కారణం : డొనాల్డ్ ట్రంప్

దీనితో అక్కడ నయం చేసే ప్రక్రియ ప్రారంభం అవుతుంది.కానీ ఎప్పుడైతే ఐస్ వాడతామో ఈ మొత్తం ప్రక్రియకు విఘాతం కలుగుతుంది.

Advertisement

అసలు ఐస్ అనేది గాయానికి ఏమి చేస్తుంది ? శోషరస ద్రవాలు ప్రవాహాన్ని ఐస్ అడ్డుకుంటుంది.దీని వల్ల మనకు దెబ్బ నయమయ్యే సమయం మరింత పెరుగుతుంది.కండరాల మధ్య సమన్వయాన్ని, వేగంతో కూడిన బలాన్ని ఐస్ తగ్గిస్తుంది.

ఇందు వల్ల మన కండరాల కదలిక తగ్గిపోతుంది.కణాల సంకేతవ్యవస్థ లో ఐస్ జ్యోక్యం చేసుకుంటుంది.

ఇందు వల్ల దెబ్బ తగిలిన భాగంలో కణాలు అంత త్వరగా వృద్ధి చెందకుండా అడ్డుకుంటుంది.ఇందు వల్ల ఆ భాగం నయం అవ్వడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది.

కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మీరు తాత్కాలికం గా నొప్పిని తగ్గించుకోవడానికి ఐస్ ని వాడండి.ఆ తర్వాత ఖచ్చితంగా వైద్య సహాయాన్ని తీనుకోండి.

తాజా వార్తలు