నువ్వేమైనా స్టార్ హీరోయిన్ అనుకున్నావా.. అనసూయ పై మెగా ఫాన్స్ ఫైర్!

బుల్లితెర పై ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో యాంకర్ అనసూయ ఒకరు.ఈమె జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఆ పాపులారిటీతో సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు.

 Do You Think You Are A Star Heroine Mega Fan Fire On Anasuya, Anasuya, Mega Fan-TeluguStop.com

ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి అనసూయ ఏకంగా తనకు లైఫ్ ఇచ్చినటువంటి జబర్దస్త్ కార్యక్రమాన్ని కూడా వదిలివేశారు.ఇలా ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న అనసూయ తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమాలో అనసూయ పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ ఎంతో కీలకంగా ఉందని చెప్పాలి.ఇందులో ఈమె జర్నలిస్టు పాత్రలో నటిస్తూ మెగాస్టార్ చిరంజీవిని జైలుకు పంపించే కీలక సన్నివేశంలో నటించారు.

 Do You Think You Are A Star Heroine Mega Fan Fire On Anasuya, Anasuya, Mega Fan-TeluguStop.com

ఈమె పాత్ర ఈ సినిమాలో ఎంతో హైలెట్ అయిందని చెప్పాలి.ఇకపోతే ఇలాంటి మంచి పాత్రలో నటించినటువంటి అనసూయ గౌడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.

ఇదే విషయంపై ఓ నేటిజన్ ప్రశ్నించగా తాను వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉన్నానని అందుకే ప్రమోషన్లకు రాలేకపోయానని తెలిపారు.

Telugu Anasuya, Godfather, Fan, Chiranjeevi-Movie

ఈ విధంగా ఈమె వరస సినిమా షూటింగులతో బిజీగా ఉండటం వల్ల రాలేకపోయానని తెలియజేయడంతో ఈ విషయంపై కొందరు మెగా ఫాన్స్ స్పందిస్తూ పెద్ద ఎత్తున అనసూయ పై ట్రోలింగ్ చేస్తున్నారు. నువ్వేమైనా స్టార్ హీరోయిన్ అనుకున్నావా ప్రమోషన్లలో కూడా పాల్గొనలేనంత బిజీగా ఉండడానికి అంటూ అనసూయను ట్రోల్ చేస్తున్నారు.మరికొందరు ఇలాంటి మంచి పాత్రల్లో నటిస్తూ ప్రమోషన్లకు రాకపోవడం తన కెరీర్ కె మైనస్ అవుతుందని ఇలాంటి సినిమాల ప్రమోషన్ లో పాల్గొనడం వల్ల తన కెరీర్ కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందంటూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube