గరికపాటికి సంస్కారం లేదంటూ మెగా ఫ్యాన్స్ ట్రోల్స్.. నెట్టింట్లో వైరల్!

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు గరికపాటి నరసింహారావు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.గరికపాటి నరసింహారావు ప్రవచనాలకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు అన్న విషయం తెలిసిందే.

నరసింహారావు చెప్పే ప్రవచనాలలో విని ఎంతోమంది అందుకు తగ్గట్టుగా కూడా నడుచుకుంటూ ఉంటారు.జీవితంలో ఏ విధంగా ఎదగాలి ఎలా ఉండాలి ఎలా ఎదగాలి ఇలా ప్రతి ఒక్క విషయాన్ని ఎంతో ఓపిక,సహనంతో చెప్పే గరికపాటి తాజాగా ఆయన ప్రవర్తించిన తీరు ఒకసారిగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

తాజాగా జరిగిన అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో పాల్గన్న గరికపాటి ప్రవర్తించిన తీరులను చూసి చాలామంది మనం చూసింది గరికపాటి నేనా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ప్రవచనాల సమయంలో ఎంతో సహనం ఓర్పుతో మాట్లాడే గరికపాటి గారు తాజాగా ఆయన ప్రవర్తించిన తీరు పట్ల అందరూ ఆశ్చర్య పోవడంతో పాటు మెగా అభిమానులు ఆయనపై తీవ్ర స్థాయిలో మండి పడుతూ ట్రోలింగ్స్ సైతం చేస్తున్నారు.

తాజాగా జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమానికి గరికపాటితో పాటు పలువురు రాజకీయ నేతలు అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరయ్యారు.చిరంజీవి, గరికపాటి పై తనకున్న అభిమానాన్ని మాటల్లో చెబుతూ శిరస్సు వంచి నమస్కరించారు.

Advertisement

అనంతరం పలువురు మహిళలు చిరంజీవితో ఫోటోలు దిగడానికి రావడంతో వారితో కలిసి దిగుతూ ఉన్నారు.అదే సమయంలో పక్కనే ఉన్న గరికపాటి తన ప్రసంగాన్ని ప్రారంభించి తీవ్ర అసహనానికి లోనయ్యారు.

చిరంజీవి ఆ ఫొటో సెషన్స్ ఆపి ఇక్కడకు వచ్చి కూర్చుంటేనే నేను ప్రసంగిస్తాను, లేదంటే సెలవు ఇప్పించండి వెళ్లిపోతాను అని చెప్పారు.ఇక గరికపాటి మాటలకు చిరంజీవి స్పందించకపోవడంతో అక్కడి నుంచి లేచి వెళ్లిపోవడానికి కూడా సిద్ధమయ్యారు.ఆ సమయంలో సీపీఐ నారాయణ, అక్కడున్న కొందరు ఆపి మళ్లీ కూర్చోబెట్టారు.

కాసేపటికి చిరంజీవి అక్కడికి వచ్చి గరికపాటి పక్కన కూర్చొని ఆయన చెప్పింది విని వెళ్లారు.అయితే గరికపాటి నరసింహారావు ప్రసంగాన్ని చిరంజీవి ఎంతో ఓర్పుతో విన్నారు.ఈ విషయం పట్ల గరికపాటి పై పలువురు మెగా అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

గరికపాటి ప్రసంగానికి ముందే చిరంజీవి తనపై ఉన్న అభిమానాన్ని చాటిచెప్పిన విషయాన్ని మరిచిపోయి చిరంజీవి పై ఆ విధంగా మండిపడటం ఏమీ బాగోలేదని, కొందరు అయితే గరికపాటికి సంస్కారం లేదు అంటూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.అంతేకాకుండా సోషల్ మీడియాలో గరికపాటిని ట్రోలింగ్స్ చేస్తున్నారు అభిమానులు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు