మధ్యాహ్నం ఎక్కువగా నిద్రపోతున్నరా..? అయితే ఈ విషయాలు మీ కోసం..!

ప్రతి జీవికి ఆహారంతో పాటు నిద్ర కూడా చాలా అవసరం.కంటికి సరిపడా నిద్రలేకపోతే లేని పోని అనారోగ్యాల పాలవడం మాత్రం గ్యారంటీ.

ఎందుకంటే రోజంతా అలిసి సొలిసిన శరీరానికి నిద్ర అనేది చాలా ముఖ్యం.ఈ కాలంలో నిద్ర లేమి సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.

ఫలితంగా ఒత్తిడికి లోనయ్యి అనారోగ్యాలు కొని తెచ్చుకుంటుంటున్నారు. రాత్రి పూట సరిగా నిద్ర పట్టని వారు కనీసం మధ్యాహ్న సమయంలో అయినా ఒక కునుకు తీస్తే మంచిది అని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఉదయం అంతా కష్టపడి పని చేసి ఇంటికి వచ్చినవారు అలా మధ్యాహ్నం పూట గంట లేదంటే రెండు గంటల పాటు నిద్రపోతే ఒత్తిడి తగ్గడంతో పాటు కాస్త రిలీఫ్ కూడా ఉంటుంది.అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు మధ్యాహ్నం పూట నిద్రపోతే బరువు పెరుగుతారు కదా అనే ప్రశ్న మీలో కలగవచ్చు.

Advertisement

అయితే బరువుకు నిద్రకు మధ్య ఉన్న ఒక చిన్న లాజిక్ తెలిస్తే మీ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది.అది ఏంటంటే.

మాములుగా ప్రతి మనిషికి సగటున 5-7 గంటల పాటు నిద్ర చాలా అవసరం.అలా అని రోజు వ్యవధిలో 5 గంటల కంటే తక్కువ సమయం పాటు నిద్రపోయే వారు, 9 గంటల కంటే ఎక్కువ సమయం పాటు నిద్రించేవారు ఇలా త్వరగా బరువు పెరుగుతారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

అలాగే ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినేవారు ఈ మధ్యాహ్నం నిద్రకి దూరంగా ఉండాలి లేదంటే బరువు కచ్చితంగా పెరుగుతారు.ఈ లాజిక్ ను బేస్ చేసుకుని మీ నిద్రను మీరు ప్లాన్ చేసుకోండి.

అలానే మధ్యాహం కొంచెం సేపు నిద్రించడం వల్ల ఎక్కువ సమయం పని చేయగలుగుతాం.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

మధ్యాహ్న నిద్ర వలన గుండే మీద ఒత్తిడి తగ్గి రక్త ప్రసారణ కూడా అదుపులో ఉంటుంది.అలాగే శరీరంలో నరాల కదలిక కూడా బాగా ఉంటుందట.మధ్యాహ్నం నిద్రపోయే సైనికులపై రీసెర్చ్ చేసిన డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం మధ్యాహ్న సమయంలో నిద్రకు అలవాటైన సైనికుల కదలికలు, నిద్ర అలవాటు లేని సైనికుల కదలికలు కంటే చురుగ్గా ఉన్నాయని పరిశోధనల్లో తేలింది.

Advertisement

మీరు ఎప్పుడయినా సరే ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోండి.మన శరీరం ఎప్పుడయితే అలసటకు లోనవుతుందో అప్పుడు కచ్చితంగా ఒక గంట నిద్రపోవలి అని.అప్పుడే మన శరీరంతో పాటు మన మనసు, ఆలోచనలు ప్రశాంతగా ఉంటాయి.

తాజా వార్తలు