50 కోట్ల క్లబ్ లో చేరిన బ్యాచిలర్..టీమ్ ఫుల్ ఖుషీ!

అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’.ఈ సినిమాలో అఖిల్ కు జంటగా బుట్టబొమ్మ పూజ హెగ్డే నటించింది.

 Most Eligible Bachelor Movie Finally Joined The 50 Crore Club ,50 Crore Club, Am-TeluguStop.com

దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల అయినా బ్యాచిలర్ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది.అఖిల్ ఆరు సంవత్సరాల కెరీర్ లో మంచి సక్సెస్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు.

ఇక ఎట్టకేలకు మోస్ట్ ఎలిజిబుల్ బైచిలర్ సినిమాతో అసలైన విజయం ఎలా ఉంటుందో రుచి చూసాడు.అఖిల్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న హిట్ ఈ రేంజ్ లో వచ్చేసరికి అక్కనేని హీరో గాల్లో తేలిపోతున్నాడు.

ఈ సినిమా విడుదల అయినా ఫస్ట్ డే నుండే కలెక్షన్స్ అద్భుతంగా వసూలు చేస్తుంది.ఇక ఈ సినిమా విడుదల అయినా ఐదు రోజుల్లోనే డిస్టిబ్యూటర్స్ కు లాభాలను తెచ్చి పెట్టింది.

Telugu Crore Club, Akhil Akkineni, America, Pooja Hegde, Tollywood-Movie

ముఖ్యంగా అమెరికా లో సత్తా చారి ఓవర్ సీస్ మార్కెట్ కు ఊపిరి పోసిందని చెప్పాలి.ఈ సినిమా ఇప్పటికే రెండు వారాల పాటు విజయవంతంగా ప్రదర్శింప బడి ఇప్పుడు మూడవ వారంలోకి అడుగు పెట్టింది.ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్లు వసూలు చేసిందని మేకర్స్ అధికారికంగా పోస్టర్ ద్వారా తెలిపారు.బ్యాచిలర్ సినిమా విడుదల అయినా 18 రోజులకు 50 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టింది.

అఖిల్ ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఏవీ కూడా కలెక్షన్స్ ఇంత రాబట్టలేదు.ఇక ఈ సినిమాతో అఖిల్ మొదటిసారి 50 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టడంతో అక్కినేని అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక అఖిల్ కెరీర్ జెట్ స్పీడ్ లో దూసుకు పోతుందని ఫుల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Telugu Crore Club, Akhil Akkineni, America, Pooja Hegde, Tollywood-Movie

ఇక అఖిల్ ఈ సినిమా తర్వాత చేస్తున్న ఏజెంట్ సినిమాకు కూడా బ్యాచిలర్ విజయం కలిసొచ్చే అవకాశం ఉంది.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి.ఈసారి అఖిల్ మాస్ ఫ్యాన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా యాక్షన్ ఎంటర్టైనర్ ఎంచుకున్నాడు.

మొత్తానికి అఖిల్ ఎదురు చుసిన హిట్ అయితే తన ఖాతాలో వేసుకున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube