మీరు పక్షుల్ని పెంచుతున్నారా? వాటికోసమే అక్కడ ఉచిత ఆసుపత్రి వుంది?

నేడు దైనందిత జీవితంలో మనిషి సాటి మనిషికే సమయం కేటాయించలేని పరిస్థితి.ఈ క్రమంలో సొంత కుంటుంబ సభ్యులనే విస్మరిస్తున్నాడు.

ఇలాంటి తరుణంలో పశు పక్ష్యాదులను, జంతువులను పట్టించుకున్న పాపానపోలేదు.అయినా కొంతమంది ఔత్సాహికులు తమకున్న కొద్దిపాటి సమయంలోనే ఇలాంటి వాటికి పెద్దపీట వేస్తూ వుంటారు.

అవును, జంతువులను కొంతమంది పెంచుకున్నట్టే.పక్షులను కూడా పెంచుకొనేవారు, పట్టించుకొనేవారు లేకపోలేదు.

అయితే ఇక్కడ వాటికి ఏదన్నా ఓ రోగం సోకినప్పుడు మాత్రం చాలామందికి వాటిని ఎలా సంరక్షించుకోవాలో పెద్దగా తెలియదు.అయితే అలాంటి పక్షులను కాపాడటం కోసమే పంజాబ్‌లోని ఓ పురాతన గోశాల నిర్వాహకులు వాటికోసం ప్రత్యేక ఆస్పత్రిని నిర్మించారని మీకు తెలుసా? అవును.ఇక్కడ చిలకలు, పిచ్చుకలు, పావురాలు వంటి అనేక పక్షులకు వైద్య సేవలు అందిస్తున్నారు.

Advertisement

పక్షులు మరలా తిరిగి ఎగిరి పోయేంత ఆరోగ్యంగా ఉంటేనే వాటిని స్వేచ్ఛగా నింగిలోకి వదిలేస్తున్నారు.అలా లేని వాటిని వారి సంరక్షణలోనే ఉంచుకుని కొన్ని వేల పక్షులకు అక్కడ సేవలు చేస్తున్నారు.

లుధియానా గోషాల నిర్వాహకులు.దీనికోసం కొంతమంది జంతుప్రేమికుల దగ్గర్నుంచి విరాళాలు సేకరించి తీవ్ర అనారోగ్యంతో ఉన్న పక్షులకోసం ఏకంగా ఓ ICU వార్డునే అక్కడ ఏర్పాటు చేయడం విశేషం.అలాగే ఇక్కడ నిర్వాహకులు ఇళ్లలో పెంచుకునే పక్షులతోపాటు నిస్సహాయ స్థితిలో ఉన్న పక్షులను ఎవరైన తీసుకొస్తే ఎలాంటి రుసుము తీసుకోకుండానే చికిత్స చేస్తారు.

అంతేకాకుండా పక్షుల కోసం ఆస్పత్రి ఆవరణంలోనే తిండి గింజలు, నీటిని ఏర్పాటు చేశారు.వాటి కోసం వచ్చిన పక్షుల్లో ఏవైనా జబ్బుపడి ఉంటే వాటికి వెంటనే చికిత్స చేస్తారు.

పర్యావరణ కాలుష్యం, రేడియేషన్‌ కారణంగా పక్షుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పుష్ప 2 సినిమా కోసం ఫాహాద్ ఫజిల్ ఎంత రెమ్యూన రేషన్ తీసుకుంటున్నాడో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు